చెన్నైలో విషాదం.. తొక్కిసలాటలో 100 మంది పైగా..

చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’లో విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. 

అర్బన్‌ నక్సల్స్‌తో కాంగ్రెస్ దోస్తీ.. ప్రధాన సూత్రధారి ఆయనే: మోదీ

కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది అర్బన్ నక్సల్స్ మూఠాలేనంటూ ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తిప్పికొట్టడానికి దేశప్రజలంతా ఏకం కావాలన్నారు. ఆదివారం మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు.

గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్‌ నుంచి కొత్త రైలు ప్రారంభం

సికింద్రాబాద్‌ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్టు.. రూ.1.64 కోట్లు స్వాధీనం

దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు.

ఆపరేషన్ భేడియా సక్సెస్.. ఆరో తోడేలును మట్టుబెట్టిన గ్రామస్థులు

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో గత కొన్ని నెలలుగా తోడేళ్ల భయం నెలకొంది. మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఇప్పటివరకు ఐదు తోడేళ్లు పట్టబడగా.. శనివారం ఆరో తోడేలును కూడా గ్రామస్థులు మట్టుబెట్టారు. దీంతో ఆపరేషన్ భేడియా సక్సెస్ అయ్యింది.

దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం

మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Web Stories
web-story-logo pomogranet1 లైఫ్ స్టైల్

దానిమ్మ రోజూ తింటే ఏమవుతుంది..?

web-story-logo workinghours10 వెబ్ స్టోరీస్

ఈ దేశాల ప్రజలు పనిలో కాంప్రమైజ్‌ కారు

web-story-logo fighterjets2 వెబ్ స్టోరీస్

యుద్ధ విమానాలను అమ్మకానికి పెడతారా?

web-story-logo giving-the-gift-of-good-health-2024-01-18-17-54-39-utc (1) lifestyle

విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా?

web-story-logo prabhs_V_jpg--816x480-4g వెబ్ స్టోరీస్

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీస్ ఇవే!

web-story-logo GZG3tn5XEAAvTNj వెబ్ స్టోరీస్

'దేవర' తో పాటూ ఫస్ట్ వీక్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే!

web-story-logo Nabha Natesh y వెబ్ స్టోరీస్

కళ్ళజోడు నభా .. కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఫోజులు

web-story-logo cake71 వెబ్ స్టోరీస్

కేక్‌ తింటే క్యాన్సర్‌ వస్తుందా?

web-story-logo garlic10 వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

web-story-logo Tollgate10 వెబ్ స్టోరీస్

ప్రపంచంలో ఏ దేశాల్లో టోల్‌ట్యాక్స్‌ ఉండదు..?

దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా!

తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్‌ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్‌, గవర్నర్‌లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్‌'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు.

ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్

ఇరాన్‌కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఇస్మాయిలీ ఖానీని ఇజ్రాయెల్ హతం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 24 మంది మృతి!

ఇజ్రాయెల్ దళాలు తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై దాడి చేయగా దాదాపుగా 24 మంది మరణించారు. మసీదులో జీవిస్తున్న నిరాశ్రయులైన ప్రజలపై ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

లెబనాన్‌లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా బీరుట్‌ దక్షిణ ప్రాంతంలో డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్‌ పౌరులు మృతి చెందారు.

Africa: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 6‌00 మంది ఊచకోత

ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బైక్‌ల మీద వచ్చి కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చేశారు. 

Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్‌!

కమలా హారిస్‌ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్‌ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్‌ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

రేపు గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల

TG: రేపు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని మహేష్ గౌడ్ కోరారు.

రుణమాఫీపై ప్రధాని మోదీ Vs సీఎం రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఆధారాలతో సహా ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారు. జరుగుతున్న వాస్తవానికి, మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం తనను బాధించిందని సీఎం అన్నారు.

మూసీపై వెనక్కి తగ్గేదే లేదు.. సీఎం రేవంత్ సంచలనం

TG: మూసీపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూసీ మురికిని ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు.

ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ!

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన!

తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్‌లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

BREAKING: కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు!

TG: కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులోపేర్కొన్నారు.

తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు.

ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్!

వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ!

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై మోదీతో చర్చించనున్నట్లు సమాచారం.

ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్‌మాల్‌

ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ

AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

అమెరికా నుంచి రప్పించి.. సినిమా లెవెల్‌లో కిడ్నాప్

విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్‌ అనే ఎన్ఆర్ఐ ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా

ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోటబొమ్మాళిలోని జీయన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు 43 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరాడు. పార్టీ సెంట్రల్ మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో.. నాలుగోరోజు అమ్మవారు దర్శనం

విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

Business: పనికిరాని పెంకులతో లక్షల్లో ఆదాయం

ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు.

బెస్ట్ మైలేజ్ కార్లు.. కేవలం రూ.6 లక్షల లోపే..!

బెస్ట్ మైలేజ్ కారు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. అందులో హ్యుందాయ్ ఎక్స్‌టర్, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో, 2024 స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ వంటి కార్లను కేవలం రూ.6 లక్షల లోపు కొనుక్కోవచ్చు.

Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే?

టెక్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్‌ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి.

100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..!

రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి.

అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్‌లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు.

సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్‌ లాంచ్.. కేవలం రూ. 59,880కే..!

టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది.

బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు

అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price