Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్‌!

కమలా హారిస్‌ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్‌ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్‌ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

New Update
USA : కమలా హారిసే గెలుస్తారు‌‌ – నోస్ట్రాడమస్ అలెన్ లిచ్ట్‌మన్ జోస్యం

Kamala Haris: అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ , డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌ లు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. 

Also Read: పక్కా వ్యూహంతోనే ఎన్‌ కౌంటర్

అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్‌ ఆగిపోవడంతో ఆమెకు ఏమి మాట్లాడాలో తెలియక ఒకే పదాన్ని రిపీట్‌ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ విషయానికి  సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మిచిగాన్ లో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

Also Read: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి

ఈ కార్యక్రమానికి దాదాపు 5 వేల మందికి పైగా మద్దతుదారులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ఇంకా 32 రోజులు మాత్రమే సమయం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో టెలీ ప్రాంప్టర్‌ ఆగిపోవడంతో 32 రోజులు అనే పదాన్ని ఆమె పదే పదే పలికారు.

Also Read: హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

ఆ తరువాత ఆమె ఈ రేసు కష్టమైనప్పటికీ మనం విజయం సాధిస్తామంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సంఘటనతో ఉపాధ్యక్షురాలు బహిరంగ ప్రదర్శనల్లో టెలీ ప్రాంప్టర్‌ పై ఆధారపడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

Also Read: హర్యానా,జమ్మూ–కాశ్మీర్‌‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు