Ind Vs Ban: తొలి టీ20లో భారత్ ఘన విజయం!

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది. 

New Update
dfdrerer

Ind Vs Ban: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది. 


టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. మెహిదీ హసన్ మిరాజ్ (35*; 32 బంతుల్లో 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27; 25 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్‌ సింగ్ (3/14) అదరగొట్టారు. మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్‌ పాండ్య తలో వికెట్ పడగొట్టారు. భార బ్యాటర్లలో సంజు శాంసన్ 29, అభిషేక్ శర్మ 16, సూర్య కుమార్ యాదవ్ 29, నితిష్ కుమార్ రెడ్డి 16 నాటౌట్, హార్దిక్ పాండ్యా 36 నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు