తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు.

New Update
modi 2

PM Modi: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. బంజారాలతో పాటు అట్టడుగు వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందన్నారు. మహారాష్ట్రలోని వదర్భలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ప్రతీ ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలివ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆరోపణలు చేశారు. తెలంగాణలో (Telangana) కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. 

Also Read: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. సర్కార్ కొత్త స్కీమ్!

కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారు

కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా రైతులకు రుణమాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను గౌరవించదని.. అసలు వాళ్ల అవసరాలే పట్టించుకోదని మండిపడ్డారు. అంతేకాదు డ్రగ్స్ వ్యాపారంలో కూడా కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో దొరికిన డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత పాత్ర ఉందని విమర్శించారు.

డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్యాలవైపు నెట్టి.. వాటి ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికలకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. దేశ వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన అజెండాను ఓడించేందుకు మహారాష్ట్ర ప్రజలంతా ఏకం కావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు