‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా! తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్‌లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు. By srinivas 06 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Batukamma America:తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు బతుకమ్మను అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు ఈ వారోత్సవాలను ప్రతియేటా జరుపుకోబోతున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్‌లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ అధికార ప్రకటనలు విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా జరుపుకునే ఈ పండుగకు అంతర్జాతీయంగా గౌరవం దక్కడంపై తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Proud moment for Telangana! 🎉 #Bathukamma festival has officially been recognized in the #USA! 🇺🇸 Georgia & Virginia states, and Charlotte & Raleigh cities in North Carolina declare a special week to honor #Bathukamma as #TelanganaHeritageWeek! 🌺 #TelanganaPride pic.twitter.com/OjRglpfUFQ — Boddu Venkanna Yadav (@venkannayadav26) October 6, 2024 ఇక తెలుగు వాళ్ళు అధికంగా నివసించే న్యూయార్క్, న్యూ జెర్సీ, టెక్సాస్, చికాగో, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా, వర్జినియా, ఒహాయో, జార్జియా ఫ్లోరిడా రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. #america #bathukamma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి