ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్! వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 06 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Dhuvvada-Madhuri: వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. స్కూటీపై షికార్లు చేస్తున్న ప్రేమ జంటను చూస్తుంటే ముచ్చటేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వీరిద్దరిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్య వాణికి దువ్వాడ శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. తను ఉంటున్న ఇంటిని దువ్వాడ మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. దువ్వాడ ఉంటున్న ఇల్లు నాదే అంటూ దివ్వెల మాధురి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు బయటపెట్టింది. దీంతో ఇంటి దగ్గర బంధువులతో కలిసి దువ్వాడ వాణి ఆందోళన చేపట్టింది. సీసీ కెమెరాలు పగలగొట్టి, తలుపు ధ్వంసం చేసింది. మాధురికి ఇంట్లో ఉంటే హక్కు లేదని నిరసన చేపట్టింది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇలా ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర్వుల్ని టెక్కలి పోలీసులకి ఇచ్చిన దువ్వాడ వాణి.. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చింది. అయితే, వారిని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఇంటి బయట దువ్వాడ భార్య, కూతుళ్లు గొడవకి దిగారు. దువ్వాడ ఇంటికి చేరుకుంటున్న బంధువులు వాణిని, కూతుళ్లను ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టారు. ఇంటి బయట భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. #duvvada-srinivas #divvela-madhuri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి