చెన్నైలో విషాదం.. తొక్కిసలాటలో 100 మంది పైగా..

చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’లో విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. 

New Update
deeded

Chennai Air Show:తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం (IAF) ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. గాలి ఆడక 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. 

అలాగే మెరీనా బీచ్‌ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంల్లో నిలబడేందుకు స్థలం లేకుండా పోయింది.

ఇక ఈ ఎయిర్‌ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు