Africa: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 6‌00 మంది ఊచకోత

ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బైక్‌ల మీద వచ్చి కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చేశారు. 

New Update
firing

600 people Killed: 

ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉన్న బర్సాలోగో అత్యంత భయానక ఘటన చోటు చేసుకుంది. సిటీలోకి ఎంటర్ అయిన ఉగ్రవాదులు 600 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేశారు. ఆగస్టులో ఈ సంఘటన జరిగింది.  ఆగస్టు 24న బర్సాలోగోకి కొంత మంది ఉగ్రవాదులు బైక్‌లపై దూసుకువచ్చారు. అలా వస్తూ కనిపించిన వారందరినీ కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ సంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమిన్‌ మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచరించారు. 

బుర్కినాఫాసోలో ఎప్పటి నుంచో ఉగ్రవాదుల దాడులు చేస్తూనే ఉన్నారు. వీరు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకుని అక్కడి మిలటరీ గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని ఆదేశించింది. బర్సాలోగోలో ప్రజలు ఈ పని చేస్తుండగానే ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెడుతున్నా వదిలిపెట్టలేదు. మొదట ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐరాస అంచనా వేసింది. కానీ తీరా లెక్కలు చూస్తే మొత్తం దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఇది జరిగిన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు మూడు రోజుల సమయం పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు ఈ దాడి తర్వాత బుర్కినా ఫాసో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే అది బయట ప్రపంచానికి తెలియకుండా అక్కడి సైన్యం వారిని అణిచి వేసింది. ఈ దేశంలో పాలన రెండుసార్లు సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత 2022లో  మిలిటరీ జుంటా చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Also Read: Bengaluru: నటుడు దర్శన్‌ ను వెంటాడుతున్న రేణుకాస్వామి ఆత్మ!

Advertisment
Advertisment
తాజా కథనాలు