లెబనాన్‌లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా బీరుట్‌ దక్షిణ ప్రాంతంలో డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్‌ పౌరులు మృతి చెందారు.

New Update
lebanon attack

Israel Hezbollah War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు, ఎక్కడ బాంబు దాడులు జరుగుతాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్‌ పౌరులు మృతి చెందారు. అలాగే హమాస్ మిలిటరీ విభాగంలో మరో ఇద్దరు సీనియర్లను కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హమాస్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ముహమ్మద్ హుస్సేన్‌ అలీతో పాటుగా నైఫ్ అలీ కూడా హతమయ్యారు.    

Also Read: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 6‌00 మంది ఊచకోత

ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ, ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్ కలిసి సంయుక్త దాడులు చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్‌ ఆయుధాల సరఫరాను నిలిపివేసింది. ఇకపై గాజాపై దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేయబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రకటించారు. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. మెక్రాన్ ప్రకటన సిగ్గుచేటు అంటూ ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఇటీవల లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అనంతరం ఇజ్రాయెల్‌పై ఇరాన్‌.. దాదాపు 200 క్షిపణులతో విరుచుకుపడింది. తమపై దాడులకు పాల్పడి ఇరాన్‌ తప్పు చేసిందని.. త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుందని నెతన్యాహు హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు