మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 24 మంది మృతి!

ఇజ్రాయెల్ దళాలు తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై దాడి చేయగా దాదాపుగా 24 మంది మరణించారు. మసీదులో జీవిస్తున్న నిరాశ్రయులైన ప్రజలపై ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

author-image
By Kusuma
New Update
GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి

ఇజ్రాయెల్ దళాలు సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపుగా 24 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి దగ్గరలో మసీదు ఉంది. ఇక్కడ జీవిస్తున్న నిరాశ్రయులైన ప్రజలపై ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన ఇంకా చేయలేదు. ఉత్తర లెబనాన్‌లోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో హమాస్ అధికారి, అతని కుటుంబ సభ్యులు మరణించారు. 

ఇది కూడా చూడండి: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

కీలక నేతలను చంపడంతో..

గత ఏడాది 2023లో హమాస్‌ దాడితో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 42000 మంది మరణించినట్లు సమాచారం. ప్రారంభం నుంచి హమాస్ ఇరాన్‌కు మద్దతు ఇస్తోంది. అయితే ఇటీవల హెజ్‌బొల్లా కీలక నేతలను చంపడంతో మరికొందరి నేతలను హతమార్చడంతో పాటు క్షిపణులను కూడా ఇజ్రయెల్  ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి దాడి చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.  

ఇది కూడా చూడండి: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా

Advertisment