🔴India - Pakistan War Live Updates: భారత్ Vs పాకిస్థాన్.. బార్డర్లో హైటెన్షన్!

పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఇండియా-పాక్ సరిహద్ధుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Manoj Varma
New Update
terror attack in j and k

terror attack in j and k

india pakistan war 2025

  • Apr 28, 2025 21:52 IST

    Pakistan: నీళ్ల కోసం పాకిస్తాన్‌లో నిరసనలు.. రోడ్డెక్కిన పాక్ ప్రజలు

    పాకిస్తాన్‌లో నీళ్ల కోసం ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. సింధ్ ప్రావిన్స్‌లో జనాలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. భారత్‌ సింధు నది నీళ్లు ఆపడంతో.. సింధ్ రాష్ట్ర ప్రజల ఉద్యమం తీవ్రమైంది. 

    Pakisthan Sindh province
    Pakisthan Sindh province

     



  • Apr 28, 2025 21:52 IST

    పహల్గామ్ టెర్రర్ అటాక్‌.. మరో భయంకరమైన వీడియో (VIDEO VIRAL)

    పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌పై వెళ్తుండా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన స్పాట్‌‌ ఏరియా మొత్తం కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగుతు తీశారు.

    terror attack goes viral



  • Apr 28, 2025 21:52 IST

    Pakistan: తోకముడిచిన పాకిస్థాన్.. ఉగ్రవాదులను తరలిస్తున్న పాక్ సైన్యం..

    పాకిస్థాన్‌ సైన్యం.. పీవోకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్‌ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. వాళ్లని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది.

    Pakistan moving terrorists into bunkers after India zeroes in on launch pads, Sources
    Pakistan moving terrorists into bunkers after India zeroes in on launch pads, Sources

     



  • Apr 28, 2025 17:10 IST

    Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా

    టర్కీలో 2023లో భారీ భూకంపం సంభవిస్తే ఇండియా సాయం చేసింది. కానీ ఇప్పుడు ఇండియా, పాక్ మధ్య గొడవలు వస్తుంటే టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. సాయం చేసిన కృ‌తజ్క్షత మరిచి టర్కీ పాక్‌ మద్దతు ఇస్తోంది. యుద్ధ సామగ్రిని, ఆరు C-130 విమానాలు అందించింది.

    Turkey weapons to Pakistan



  • Apr 28, 2025 16:57 IST

    Asaduddin Owaisi : వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

    భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి దాడులు చేస్తే ఊరుకోమని పాకిస్తాన్ ను AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మతం పేరుతో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పాక్ అగ్రనేతలు ఉగ్రవాద సంస్థ ISIS తో సమానమని అన్నారు.  

    owisi modi
    owisi modi

     



  • Apr 28, 2025 16:57 IST

    India Pakistan War: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?

    భారత్ దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్‌ ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించదు. ఎందుకంటే భారత్ అణు విధానం నో ఫస్ట్ యూస్. కానీ పాక్ మొదట న్యూక్లియర్ దాడి చేసే అవకాశం ఉంది. 2 దేశాలు అణ్వాయుధాలు వాడాలంటే ప్రధాని నిర్ణయం తీసుకోవాలి.

    India Vs Pakistan War - Live Updates
    India Vs Pakistan War - Live Updates

     



  • Apr 28, 2025 16:56 IST

    India-Pakistan: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ప్రస్తుతం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

    Nawaz Shrif and Shebaz Sharif
    Nawaz Shrif and Shebaz Sharif

     



  • Apr 28, 2025 15:38 IST

    Pahalgam Attack : ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!

    పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటనలు చేశారు.  పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్.. భారత్ లో చిన్న పటాకులు పేలిన భారత్ పాక్‌నే నిందిస్తాయని అన్నారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు.

    pahalgam terror attack
    pahalgam terror attack

     



  • Apr 28, 2025 15:38 IST

    India Pak War: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. రంగంలోకి రాఫెల్-M ఫైటర్ జెట్లు!

    పాక్, భారత్‌ ఉద్రిక్త పరిస్థితిలో రంగంలోకి రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఇటీవల రూ.63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వాటిని అనుకున్న టైం కంటే ముందే ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్‌ను కోరారు.

    Rafale fighter jet deal



  • Apr 28, 2025 14:50 IST

    Pakistan: కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340.. పాకిస్థాన్ లో ఘోర పరిస్థితి

    పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ ధరలు మాములుగా లేవు.. కిలో చికెన్ ధర రూ.800 గా ఉంది. బియ్యం ధర కిలోరూ.340. గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, గుడ్ల ధర డజనుకు రూ.332, పాలు లీటరుకు రూ.224గా ఉంది.

    pak-chicken
    pak-chicken

     



  • Apr 28, 2025 14:49 IST

    BREAKING: మావోయిస్టులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు.. కవిత సంచలన వ్యాఖ్యలు!

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మావోయిస్టులకు మద్దతుగా నిలిచారు. కేసీఆర్‌కు వాఖ్యలకు సపోర్టుగా ఆపరేషన్ కగార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను అంతం చేస్తామనే కేంద్ర ప్రభుత్వం విధానం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు జరపాలని కోరారు. 

    kavitha mlc
    kavitha mlc Photograph: (kavitha mlc)

     



  • Apr 28, 2025 14:48 IST

    BIG BREAKING: నాలుగు ముక్కలుగా పాకిస్తాన్!

    పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన జోష్యం చెప్పారు. 2025 నాటికి పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. POKతో పాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే ముక్కలుగా విభజించబడుతుందని అన్నారు.

    pak 4 parts
    pak 4 parts Photograph: (pak 4 parts)

     



  • Apr 28, 2025 14:48 IST

    CM Omar Abdullah: ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి.. ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!

    పహల్గామ్ దాడికి సంబంధించి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో సోమవారం చాలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత తాను పూర్తి రాష్ట్ర హోదాను ఎలా అడగగలనని ఆయన అన్నారు.

    CM-Omar-Abdullah
    CM-Omar-Abdullah

     



  • Apr 28, 2025 13:40 IST

    బంగ్లా అధికారితో పహల్గాం ఉగ్రవాదుల భేటీ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత రోజే లష్కరే తోయిబా నేతతో బంగ్లా లీగల్ అడ్వైజర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. డాక్టర్ అసిఫ్ నజ్రుల్ లష్కరే తోయిబా నేత ఇజార్‌తో భేటీ అయ్యారని, పలు విషయాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే వీరు పహల్గాం దాడికి ముందు కలిశారని అంటున్నారు.

    India attacks pak
    India attacks pak

     



  • Apr 28, 2025 13:39 IST

    పాక్‌పై దాడిచేస్తే బతకరు.. మోదీకి వార్నింగ్ ఇస్తూ ఖలిస్తానీ నేత బలుపు మాటలు!

    పహాల్గాం అటాక్ నేపథ్యంలో ఖలిస్తానీ నేత పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌పై దాడిని సిక్కులు అనుమతించరన్నాడు. 20 మిలియన్ల మంది పాకిస్తాన్‌కు ఇటుక గోడలా రక్షణ కల్పిస్తారన్నాడు. పాక్‌పై అటాక్ చేస్తే మోదీ, షా ఎవరు బతకరంటూ హెచ్చరించాడు.

    pannu khalistan
    pannu khalistan Photograph: (pannu khalistan)

     



  • Apr 28, 2025 13:39 IST

    Pahalgam Attack: సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం కేసు!

    ప్రముఖ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. పహల్గామ్ దాడి విషయంలో కేంద్రాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అభయ్ ప్రతాప్ అనే వ్యక్తి ఫిర్యాదుతో లక్నో హజ్రత్‌గంజ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

    pahalgam attack  case filed against singer Neha Singh Rathore
    pahalgam attack case filed against singer Neha Singh Rathore

     



  • Apr 28, 2025 13:12 IST

    చైనా సాయంతోనే ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన నిజాలు

    చైనా సాయంతోనే ఈ ఉగ్రదాడికి పాక్ పాల్పడినట్ల సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులు చైనీస్ యాప్‌ల ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. పహల్గాం దగ్గర ఓ చైనీస్ శాటిలైట్ ఫోన్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

     

     



  • Apr 28, 2025 12:18 IST

    పాక్‌కి సపోర్ట్‌గా కథనాలు.. బీబీసీకి కేంద్రం అభ్యంతర లేఖ

    పాక్‌కి సపోర్ట్‌గా కథనాలు ప్రచురించిందని లేఖ ద్వారా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీబీసీకి లేఖ రాసింది. ఇటీవల ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో ఉగ్రదాడికి బదులు మిలిటెంట్ దాడి అని బీబీసీ రాసింది. ఈ క్రమంలోనే అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. 

    Government letter to BBC
    Government letter to BBC

     



  • Apr 28, 2025 12:17 IST

    మోదీతో రాజ్‌నాథ్‌ కీలక భేటీ.. ఏ క్షణమైనా పాక్‌పై అటాక్!

    పాక్‌తో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఏ క్షణమైనా పాక్‌పై దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దత, ఉగ్రవాదుల ఏరివేతపై చర్చించినట్లు తెలుస్తోంది.

    Pak war
    Pak war

     



  • Apr 28, 2025 11:03 IST

    పాక్‌కు మరో బిగ్ షాక్.. ఆ ఛానెల్స్‌పై నిషేధం

    భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను దేశంలో నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది. 

    Pakistani YouTube channels
    Pakistani YouTube channels

     



  • Apr 28, 2025 10:16 IST

    ఉగ్రదాడి నిందితులపై సైన్యం కాల్పుల వర్షం

    పహల్గాం దాడికి చేపట్టిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు గుర్తించారు. అడవులలో ఒక మూలన ఉండటంతో వారిపై కాల్పులు కూడా జరిపారు. ఉగ్రవాదులకు దగ్గరలోనే ఉన్నారని త్వరలోనే పట్టుకోనున్నట్లు ఓ సైనికాధికారి వెల్లడించినట్లు సమాచారం.

    Pahalgam attack terrorists
    Pahalgam attack terrorists

     



  • Apr 28, 2025 10:12 IST

    బాధ్యతాయుతంగా పరిష్కరించుకోండి..అమెరికా

    పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తాజాగా దీని పై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం పేర్కొంది.

    usa
    Trump Bumper Offer To Immigrants

     



  • Apr 28, 2025 10:10 IST

    పహల్గాం ఉగ్రదాడి.. భయంతో చైనాను ఆశ్రయించిన పాక్

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో భయం నెలకొంది. భారత్‌కు భయపడి పాక్.. చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించినట్లు సమాచారం.

    Read More



  • Apr 28, 2025 10:09 IST

    పూంఛ్‌ సెక్టార్‌లో కాల్పులు.. పాక్‌ను తిప్పికొట్టిన భారత్

    పూంఛ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అర్థరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్‌ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడటంతో భద్రతా బలగాలు తక్షణమే స్పందించాయి.

    Read More



  • Apr 28, 2025 10:05 IST

    శ్రీనగర్ లో మళ్లీ ప్రారంభమైన టెర్రరిస్ట్ ల రాక



  • Apr 28, 2025 09:59 IST

    పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఇతర దేశాల్లోని భారతీయు ఆందోళన



  • Apr 28, 2025 09:57 IST

    భారత్ కే మెజార్టీ దేశాల సపోర్ట్



  • Apr 28, 2025 09:56 IST

    పహల్గామ్ లో మళ్లీ ప్రారంభమైన టూరిస్టుల సందడి



  • Apr 28, 2025 08:31 IST

    పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్

    పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ వల్ల జమ్మూకశ్మీర్‌లో 90 శాతం వరకు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు.

    jammu Kashmir
    jammu Kashmir

     



  • Apr 28, 2025 08:30 IST

    పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!

    పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.పాక్‌కు భారత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాక్‌లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Fake Medicines: మార్కెట్లో నకిలీ మందులు.. వేసుకుంటే అంతే గతి.. సిగ్గు లేదా? చావుతో వ్యాపారామా..?



  • Apr 28, 2025 08:29 IST

    భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

    భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

    pak armyy
    pak armyy

     



  • Apr 28, 2025 08:28 IST

    భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

    పాక్‌ విదేశాంగ మంత్రి ఇశాక్‌ దార్‌ తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ ఫోన్‌ లో మాట్లాడినట్లు సమాచారం. ఢిల్లీ-ఇస్లామాబాద్‌ ల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

    vang yi
    vang yi

     



  • Apr 28, 2025 08:27 IST

    పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

    టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

    Read More



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు