BIG BREAKING: ఉగ్రదాడి నిందితులపై సైన్యం కాల్పుల వర్షం

పహల్గాం దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు గుర్తించారు. అడవులలో ఒక మూలన ఉండటంతో వారిపై కాల్పులు కూడా జరిపారు. ఉగ్రవాదులు దగ్గరలోనే ఉన్నారని త్వరలోనే పట్టుకోనున్నట్లు ఓ సైనికాధికారి వెల్లడించారు.

New Update

పహల్గాం ఉగ్రదాడి యావత్తు భారత్‌ను కబళించింది. 28 మంది అమాయకులు ఉగ్రవాదులు చేతిలో బలి అయ్యారు. అయితే ఈ దాడి చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు వేర్వేరు ప్రదేశాల్లో గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు గుర్తించారు. దక్షిణ కాశ్మీర్ అడవులలో ఒక మూలన ఉన్నారని, వారిపై కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

తప్పకుండా పట్టుకుంటామని..

ఉగ్రవాదులు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకోనున్నట్లు ఓ సైనికాధికారి వెల్లడించినట్లు సమాచారం. ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది.. కానీ వారిని కచ్చితంగా పట్టుకుంటామని తెలిపారు. మొదట వీరిని హపత్‌నార్ గ్రామ సమీపంలోని అడవుల్లో గుర్తించారట. అయితే దట్టమైన అడవులు కావడంతో ఉగ్రవాదులు తప్పించుకున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

పహల్గాంలో ఉగ్రదాడి జరిపిన తర్వాత ఆ ఉగ్రవాదులు కుల్గాం అడవుల్లో కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ట్రాల్ శిఖరం నుంచి కోకెర్నాగ్‌లో కనిపించారు. అయితే అడవులు దట్టంగా ఉండటంతో వారిని పట్టుకోవడానికి కాస్త ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర సాయుధ దళాలు అడవుల్లో కార్డన్, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా త్వరలోనే ఉగ్రవాదులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు