పహల్గాం ఉగ్రదాడిలో 28 పర్యాటకులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా కలచివేసింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి జరిగిన తర్వాత రోజే లష్కరే తోయిబా నేతను బంగ్లా అడ్వైజర్ కలిసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ అసిఫ్ నజ్రుల్, లష్కరే తోయిబా నేత ఇజార్‌తో భేటీ అయి.. పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి:Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!
#illegal advisor Asif Nazrul is a #Pakistani_agent and a person with #anti_india sentiments. Who is supporting #terrorism in Bangladesh. This matter raises serious concerns about the national security and stability of Bangladesh. #ResignYunus#BangladeshCrisis#No_Terrorismpic.twitter.com/NhHMncbnGt
— Battalion71 (@ImbusyWarrior) April 24, 2025
ఇది కూడా చూడండి:KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
పహల్గాం ఉగ్రదాడికి ముందే..
బంగ్లాదేశ్ నుంచి ఉగ్రదాడులకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసిఫ్ నజ్రుల్, ఇజార్‌ల మధ్య భేటీ పహల్గాం దాడికి ముందు జరిగిందని అంటున్నారు. ఇస్లామిస్టులపై దాఖలైన వేధింపుల కేసుల విషయంలో సమావేశం అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
ఇదిలా ఉండగా ఇటీవల ప్రధాని మోదీ భీమ్‌స్టిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. అయితే షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో తలదాచుకున్న తర్వాత మోదీని బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్‌ను మొదటిసారి కలిశారు. ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు మోదీతో కలిసి విందు పంచుకున్నారు.