BIG BREAKING: నాలుగు ముక్కలుగా పాకిస్తాన్!

పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన జోష్యం చెప్పారు. 2025 చివరి నాటికి పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. POKతో పాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే ముక్కలుగా విభజించబడుతుందని అన్నారు.

New Update
pak 4 parts

BJP MP Nishikant Dubey predicts on Pakistan 4 parts

BIG BREAKING: పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన జోష్యం చెప్పారు. 2025 చివరి నాటికి పాక్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. POKతో పాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే 3 ముక్కలుగా విభజించబడుతుందని అన్నారు. అంతేకాదు ఈ విషయంలో తాను పూర్తి విశ్వాసంతో ఉన్నానని, పాకిస్తాన్ ముక్కలు కాకుంటే బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తుందని విమర్శించొచ్చు అని చెప్పారు. 

ప్రతీకారం తీర్చుకుంటుంది..

ఈ మేరకు సోమవారం జార్ఖండ్‌ దేవఘర్ జిల్లాలో మహేశ్‌మార రైల్వే హాల్ట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి గురించి మాట్లాడిన నిషికాంత్.. పహల్గాంలో అమాయకులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను వదిలిపెట్టమన్నారు. ఉగ్రవాదులను ప్రపంచం అంచున ఉన్న వేటాడుతామన్నారు. వారికి అండగా నిలిచే వారిని విడిచిపెట్టమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 'ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని శపథం చేశాం. ఇది పాకిస్తాన్ విడిపోవడానికి దారి తీస్తుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ తిరిగి దక్కించుకుంటుంది. పీఓకేతోపాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే 3 ముక్కలుగా పాకిస్తాన్  విభజించబడుతుంది. మోదీ ప్రభుత్వం ఎంత మూల్యానికైనా ప్రతీకారం తీర్చుకుంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!

పాక్ సైన్యం భారతీయులు, ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలే ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఇస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలకు పాకిస్తాన్ సైన్యం బాధ్యత వహించాలి. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతతో పాక్ నీరు లేక చచ్చిపోతుందని, ఇది 56 అంగుళాల ఛాతీ సత్తా అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు. 

Also Read:  Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌‌అండ్‌‌టీ

bjp | modi | pehalgam attack | telugu-news today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు