Pahalgam Attack : ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటనలు చేశారు.  పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్.. భారత్ లో చిన్న పటాకులు పేలిన భారత్ పాక్‌నే నిందిస్తాయని అన్నారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు.

New Update
pahalgam terror attack

pahalgam terror attack

ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గా్ంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటనలు చేశారు.  పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్.. భారత్ లో చిన్న పటాకులు పేలిన భారత్ పాక్‌నే నిందిస్తాయని అన్నారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని షాహిద్ డిమాండ్ చేశాడు.  కశ్మీర్‌లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన భద్రతాసైన్యం ఉందని అయినప్పుడు ఇదంతా ఎలా  జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం అంటూ భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదంటూ భారత ప్రభుత్వంపై మండిపడ్డాడు.

Also read : Pakistan : కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340.. పాకిస్థాన్ లో ఘోర పరిస్థితి

 Also Read :  ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి..  ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!

భారత మీడియాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు

ఈ భయానక సంఘటనపై భారత మీడియా కవరేజ్ గురించి షాహిద్ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు, ఘటన జరిగిన గంటలోపే భారత మీడియా పాక్ ను  దోషిగా చిత్రీకరించిందని ఆరోపించారు. చదువుకున్న భారత మాజీ క్రికెటర్లు కూడా పాక్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే  షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలకు భిన్నంగా పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కామెంట్స్ చేశారు.  పహల్గామ్ దాడిని పాక్ ప్రభుత్వం వెంటనే ఖండించకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోలుస్తూ పాక్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీనివల్ల ఉగ్రవాదాన్ని తామే ప్రోత్సహిస్తున్నామని పాక్ నేతలు పరోక్షంగా అంగీకరించినట్లే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  

Also Read :  మావోయిస్టులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు.. కవిత సంచలన వ్యాఖ్యలు!

Also Read : కేసీఆర్ స్పీచ్ లో పస లేదు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు