Pak-India: భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

New Update
pak armyy

pak armyy

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సరిహద్దుల్లో సైన్యం మోహరింపును పెంచాయి. ఉగ్రదాడి ఘటనకు కారణమైన పాకిస్థాన్‌‌కు షాకిచ్చేలా.. సింధు జలాల ఒప్పందం సహా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది. దీనికి బదులుగా సిమ్లా ఒప్పందంతోపాటు.. భారత్‌తో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను పాకిస్థాన్ సస్పెండ్ చేసింది. దీంతో కశ్మీర్లో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినట్లయ్యింది. దీంతో పాక్ సైన్యం భారత చెక్‌పోస్టులపై కాల్పులకు తెగబడుతూ యుద్ధానికి కాలు దువ్వుతోంది.

Also Read: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

Pakistan Army Officers And Soldiers Resign

ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో ఏర్పడుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ సైన్యంలో ప్రధాన అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇలాంటి సమయంలో పాక్ సైన్యంలో రాజీనామాలు పాక్ సర్కార్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read: Elon Musk: మస్క్‌...పరపతి పెరిగింది కానీ...పాపులారిటీ తగ్గింది!

 కొన్ని సోషల్ మీడియా కథనాల ప్రకారం.. పాక్ సైన్యంలోని కొందరు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో పాటు భయంతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే వారు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.250 మందికిపైగా సైనిక అధికారులతోపాటు 1200 మంది సైనికులు కూడా రాజీనామా చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ద్వారా తెలుస్తోంది. అయితే జవాన్లు, అధికారులు రాజీనామా చేశారనే వార్తలపై ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం గానీ, పాక్ సర్కార్ గానీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. 

కానీ ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైతే.. భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ సైన్యానికి ఇది ఒక పెద్ద సవాలే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Also Read: Cinema: ఆ డైరెక్టర్ ప్రాజెక్టు కోసం ఇంటికి పిలిచి బట్టలిప్పమన్నాడు.. నగ్నంగా చూడాలంటూ: నటి సంచలనం!

pakistan | india | army | resign | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు