Jammu - Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్

పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ వల్ల జమ్మూకశ్మీర్‌లో 90 శాతం వరకు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు.

New Update
jammu Kashmir

jammu Kashmir

పహల్గాం ఉగ్రదాడితో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది బలి అయ్యారు. అయితే ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ వల్ల జమ్మూకశ్మీర్‌లో 90 శాతం వరకు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు. ముందుస్తు బుకింగ్‌లు అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయని జమ్మూ కాశ్మీర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబర్ చౌదరి తెలిపారు.

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

పర్యాటకులను టార్గెట్ చేసి..

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. 

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. అయితే ఈ ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. 

ఇది కూడా చూడండి: KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం

 

jammu-kashmir | tourists | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు