/rtv/media/media_files/2025/04/28/rdR99Cb9H1NEYdELYGKI.jpg)
Pakisthan Sindh province
Pakistan: పాకిస్తాన్ దేశ పరిస్థితి ఘోరంగా మారింది. భారత్ సింధూ నది జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాక్‌లో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. దీంతో పాకిస్తాన్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటు సెగలు రగులుతున్నాయి. నీళ్ల కోసం సింధ్ రాష్ట్రంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాక్ దేశాధినేతలు భారత్‌పై యుద్ధానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే సరిహద్దులో బలగాలను మోహరించాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే అటాక్‌కు తిప్పికొట్టాలని పాకిస్తాన్ చూస్తోంది. ఆయుధాలు సిద్ధం చేసికొని సైన్యాన్ని సంసిద్ధం చేసుకుంది. కానీ పాక్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
Also read: పహల్గామ్ టెర్రర్ అటాక్.. మరో భయంకరమైన వీడియో (VIDEO VIRAL)
Sindh in Pakistan erupts with demand for independence. They are protesting against Pakistan govt storing all water in Punjab and not sending water to Sindh. pic.twitter.com/r2uJc1O6mh
— Jiten Gajaria (@jitengajaria) April 28, 2025
Also read: BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
వేలాది మందిగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. భారత్ సింధు నది నీళ్లు ఆపడంతో.. సింధ్ రాష్ట్ర ప్రజల ఉద్యమం తీవ్రమైంది. ఓవైపు భారత్‌తో యుద్ధ భయం, మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటు వాదుల దాడులు, ఈ రెండు చాలవు అన్నట్లు ఇంకోవైపు దేశ ప్రజల తిరుగుబాటు ఇలా ఇన్ని సమస్యలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విదేశాల నుంచి పాకిస్తాన్‌కు ఆయుధాల సాయం అందుతున్నా.. పాక్‌కు నీళ్లు కావాలంటే మాత్రం భారతదేశమే దయతలచాలి.
(action on pakistan | balochistan vs pakistan | bomb-blast-in-pakisthan | Sindh province | latest-telugu-news)