Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!

పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.పాక్‌కు భారత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాక్‌లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

New Update
Fake Medicines: మార్కెట్లో నకిలీ మందులు.. వేసుకుంటే అంతే గతి.. సిగ్గు లేదా? చావుతో వ్యాపారామా..?

medicines

పుల్వామా ఉగ్రదాడి తర్వాత నుంచి ఇప్పటివరకు అంతంత మాత్రంగా ఉన్న భారత్, పాక్ సంబంధాలు.. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పూర్తిగా క్షీణించాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్.. పాక్‌ను ఎడారి చేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో పాక్‌తో అన్ని వాణిజ్య సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 

Also Read: IndiGo Flight: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!

Pakistan Faces Medicine Shortage Risk

దీంతో భారత్ నుంచి ఆ దేశానికి ఎగుమతి అయ్యే వస్తువుల సరఫరా నిలిచిపోనుంది. అయితే భారత్ నుంచి పాక్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో అతి ముఖ్యమైనవి ఔషధాలు. ఇప్పుడు ఆ ఔషధాల సరఫరా నిలిచిపోతే పాకిస్తాన్‌కు చావు దెబ్బ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్ పాక్‌ వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో.. ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై పాక్ సర్కార్ అత్యవసర చర్యలు మొదలు పెట్టింది. ఔషధాల సరఫరాలను నిర్ధారించడానికి ఆరోగ్య అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Also Read: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ప్రస్తుతం పాకిస్తాన్ ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థాల్లో 30 శాతం నుంచి 40 శాతం వరకు భారత్‌ నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడి పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా క్రియాశీల ఔషధ పదార్థాలు, క్యాన్సర్ చికిత్సలు, జీవ ఉత్పత్తులు, టీకాలు, రాబిస్ నిరోధక వ్యాక్సిన్, పాము కాటుకు వాడే ఔషదాలు ఉన్నాయి.

అయితే భారత్ నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు రెడీగా ఉన్నామని పాక్ ప్రకటించింది. అందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని.. పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ(డీఆర్ఏపీ) ప్రకటించింది. 2019 పుల్వామా ఉగ్రదాడి సమయంలో తలెత్తిన సంక్షోభం తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించినట్లు డీఆర్ఏపీ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన ఔషధ అవసరాల కోసం పాకిస్తాన్.. చైనా, రష్యా సహా యూరోపియన్ దేశాల వంటి ప్రత్యామ్నాయ వనరుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

భారత్‌తో ప్రస్తుతం వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని.. లేకపోతే తీవ్రమైన ఔషధాల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేస్తూ పాక్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. ఔషధ దిగుమతులపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సూచనలు అందలేదని పాకిస్తాన్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ప్రకటించారు.

ఇదే కొనసాగితే దేశంలో మందుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఔషధ పరిశ్రమ వర్గాలు తీవ్రంగా భయపడుతున్నాయి. ఫలితంగా దేశంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Elon Musk: మస్క్‌...పరపతి పెరిగింది కానీ...పాపులారిటీ తగ్గింది!

Also Read: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

pak | india | medicine | health | emergency | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు