/rtv/media/media_files/2025/04/28/zdD7XZpjsiOJmMvvdkk6.jpg)
vang yi
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.భారత్ ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోగా..దాయాది దేశం విషం చిమ్ముతోంది. ఈ క్రమంలోనే పాక్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ తో ఫోన్ లో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ...ఢిల్లీ-ఇస్లామాబాద్ ల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Pakistan-India-China
ఉగ్రదాడి పై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని చెప్పారు.ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని బీజింగ్ భావిస్తోంది.పరస్పరంముందుకు సాగాలని,ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోందని పాక్ మంత్రి తో వాంగ్ యీ చెప్పినట్లు చైనా మీడియా తెలిపింది.
ఉగ్రవాదం పై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా..26మందిని పొట్టనపెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడిని అమానవీయ చర్యగా అంతకుముందు డ్రాగన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా,చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.ఉగ్రఘటన దర్యాప్తు విషయంలో రష్యా,చైనా , పశ్చిమదేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్,మోడీ అబద్దం చెబుతున్నారా?లేదా..నేను వాస్తవాలు చెబుతున్నానా ? వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చయోచ్చు అని ఓ రష్యన్ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు చేశారు.
india | china | latest-news | latest-telugu-news | latest telugu news updates