Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా

టర్కీలో 2023లో భారీ భూకంపం సంభవిస్తే ఇండియా సాయం చేసింది. కానీ ఇప్పుడు ఇండియా, పాక్ మధ్య గొడవలు వస్తుంటే టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. సాయం చేసిన కృ‌తజ్క్షత మరిచి టర్కీ పాక్‌ మద్దతు ఇస్తోంది. యుద్ధ సామగ్రిని, ఆరు C-130 విమానాలు అందించింది.

New Update
Turkey weapons to Pakistan

భారత్ చేసిన సాయాన్ని మరిచిపోయి టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. 2023 ఫిబ్రవరి 6న టర్కీలో భారీ భూకంపం సంభవించింది. వందల మంది చనిపోయారు. లక్షల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. మానవత్వంతో ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ టర్కీకి అండగా నిలిచింది. ఆహర పదార్థాలు, సహయక చర్యల కోసం భారత్ నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది, వైద్య బృందాలు, NDRF టీమ్స్‌ పంపింది. అంతేకాదు ఇంకేమోనా సాయం కావాలంటే కూడా ఇండియా చేస్తోందని మోదీ ఆ సమయంలో అన్నారు. కానీ.. పాకిస్తాన్‌తో మనకు ఉద్రిక్త పరిస్థితి వస్తే విస్వాసం లేని టర్మీ పాకిస్తాన్ దేశానికి ఆయుధాలు సరఫరా చేసింది. అన్నం పెట్టినోడికి సున్నం రాయడం అంటే ఇదే మరి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తత పెరిగినప్పుడు టర్కీ పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. సోమవారం(ఏప్రిల్ 28)న కొన్ని గంటల క్రితం ఒక టర్కిష్ సైనిక విమానం రాత్రిపూట రహస్యంగా సైనిక సామగ్రిని మోసుకెళ్లి ల్యాండ్ అయింది. చైనా రహస్యంగా పాకిస్తాన్‌కు క్షిపణుల సముదాయాన్ని అందజేసింది.

India Pak War: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. రంగంలోకి రాఫెల్-M ఫైటర్ జెట్లు!

కశ్మీర్‌ విషయంలో భారత్‌తో టర్కీ విభేదిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దును టర్కీ వ్యతిరేకించింది. గోధుమల కన్‌సైన్‌మెంట్‌ విషయంలోనూ టర్కీ భారత్‌తో విభేదించి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ భారత్‌ అవేవి పట్టించుకోకుండా కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకుంది. టర్కీకి సహాయ హస్తం అందించడం ద్వారా ముస్లింలకు భారత్‌ వ్యతిరేకమని అంతర్జాతీయంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను టర్కీ సమర్థిస్తోంది. టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్‌ ఎర్డోగాన్‌ భారత్‌ నిజాయితీ గురించి అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

Also read: Pahalgam terror attack: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?

ముస్లింలు అధికంగా ఉన్న తుర్కియే పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి సైనిక సామగ్రిని పంపింది. ఏప్రిల్ 27న టర్కిష్ వైమానిక దళానికి చెందిన ఆరు C-130 హెర్క్యులస్, సైనిక రవాణా విమానాలు, యుద్ధ సామగ్రిని కరాచీకి తీసుకెళ్లింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి వీటిని పంపారు. పహల్గామ్ దాడిపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్‌తోపాటు చైనా కూడా డిమాండ్ చేసింది. పాకిస్తాన్ వైమానిక దళానికి సహాయం చేయడానికి చైనా హైటెక్ PL-15 క్షిపణులను కూడా డెలివరీ చేసిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. టర్కీ 2000 నుండి పాకిస్తానీ సైనికులకు శిక్షణ ఇస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ F-16 విమానాల నిర్వహణలో కూడా సహాయపడుతుంది. చైనా తర్వాత, పాకిస్తాన్‌కు రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారు టర్కియే. పాకిస్తాన్ జలాంతర్గాములను టర్కీ కూడా ఆధునీకరించింది.

(Turkey Earthquake | operation dost | india pak war | india pak war latest news)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు