India-Pakistan: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ప్రస్తుతం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

New Update
Nawaz Shrif and Shebaz Sharif

Nawaz Shrif and Shebaz Sharif

India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్, పాకిస్థా్న్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Former Pakistani PM Nawaz Sharif).. ప్రస్తుత ప్రధాని, తన సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అందుబాటులో ఉన్న దౌత్యమార్గాలను వాడుకోవాలని, యుద్ధానికి దూరంగా ఉండాలని ఆయన చెప్పినట్లు సమాచారం.    

Also Read: ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!

అణుబాంబు బెదిరింపులు

మరోవైపు భారత్‌పై దాడి చేసేందుకు 130 అణుబాంబు(Atomic Bomb) సిద్ధంగా ఉంచామని పాకిస్థాన్ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ(Hanif Abbasi) బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్(Asim Munir) చేసిన వ్యాఖ్యలు కూడా  వైరల్ అయ్యాయి. '' ఆచారాలు, సంప్రదాయాలు, మతం అంశాల్లో హిందువులు, ముస్లింలు వేరు. వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే  భావన అప్పట్లో వచ్చింది. పాకిస్థాన్ ఏర్పాటుకు మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారని'' ఆసిం మునీర్ అన్నారు. 

Also Read: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. రంగంలోకి రాఫెల్-M ఫైటర్ జెట్లు!

అంతేకాదు పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్‌ భిలావల్ భుట్టో జర్దారీ కూడా నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. సింధూ నది(Indus River)లో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని.. దాని నాగరికతకు తామే నిజమైన సంరక్షకులమని అన్నారు. ఇక భారత్‌, పాక్ మధ్య ఎప్పుడైనా దాడులు జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ స్పందించారు. శాంతిని పునరుద్ధరించేందుకు దౌత్యమార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 

Also Read: ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి..  ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!

Also Read:  Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌‌అండ్‌‌టీ

: telangana songs | rtv-news | india pakistan war | india-pakistan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు