భారత్-పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. 1947 నుంచి పాక్‌తో ఉన్న జమ్మూ-కశ్మీర్ సమస్య పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం అని భారత్ చూస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో రంగంలోకి రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి సోమవారం (ఏప్రిల్ 28) ఒప్పంద కుదుర్చుకున్నాయి. ఈమేరకు రూ.63,000 కోట్ల డీల్‌కు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్ విమానాల్లో 22 సింగిల్-సీటర్ జెట్‌లు ఉన్నాయి. వీటిని 2031-32 నాటికి భారత్‌కు ఇవ్వనాలని కాంట్రాక్ట్‌లో ఉంది. పాక్, భారత్ ఉద్రిక్త పరిస్థితిలో వాటిని ముందుగానే డెలివరీ ఇవ్వాలని భారత్ కోరుతుంది.
Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌కు మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!
Marathon meetings before something big!
— Akash Sharma (@kaidensharmaa) April 28, 2025
Defence Minister Rajnath Singh to meet PM Modi for the second time in last 24 hours. pic.twitter.com/8A4P5bcA6H
సోమవారం ప్రధాని మోదీ రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలోనే ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధ విమానాల డీల్ గురించి మాట్లాడారు. అనుకున్న సమయం కంటే ముందే రాఫెల్ ఫైటర్ జెట్లను ఇవ్వాలని మోదీ ప్రపోజల్ ఫ్రాన్స్‌కు పంపారు. ఇదే జరిగితే త్వరలోనే మరో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు భారత్ అంబుల పొదలోకి చేరనున్నాయి. గతంలో కూడా ఫ్రాన్స్ మనకు రాఫెల్ యుద్ధ విమానాలు సరఫరా చేసింది. అవి ప్రస్తుతం ఏయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం కొనుగోలు చేసే రాఫెల్-M జెట్లు నావేలో మిగ్-29K యుద్ధ విమానాల స్థానంలో పెట్టనున్నారు.
Also read: Pahalgam terror attack: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
Defence Minister Rajnath Singh meets PM Modi after meeting the CDS. #PMModi #RajnathSingh pic.twitter.com/B3yFqC8t9t
— Pravin Aghor (@pravin_aghor) April 27, 2025
( nuclear war | Rafale jets | rafale-marine | indian-army | indian army action | france | latest-telugu-news | india pak war | india pak war latest news)