భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి దాడులు చేస్తే ఊరుకోమని పాకిస్తాన్ ను AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మతం పేరుతో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వక్ఫ్ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని ప్రభానిలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగిస్తూ.. పాక్ అగ్రనేతలు ఉగ్రవాద సంస్థ ISIS తో సమానమని అన్నారు.
పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. అఫ్రిది వాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు, అఫ్రిదిని జోకర్ తో పోల్చారు. , మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఒవైసీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఒవైసీ కోరారు.
Following the Pahalgam attack, Shahid Afridi's controversial comments on India-Pakistan relations have sparked a political debate.
— The Siasat Daily (@TheSiasatDaily) April 28, 2025
As a reaction, Indian politician Asaduddin Owaisi criticized Afridi, calling him a "joker" and urging public figures, especially athletes, to be… pic.twitter.com/1tMwWmu113
Also read : Pakistan : కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340.. పాకిస్థాన్ లో ఘోర పరిస్థితి
Also Read : ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి.. ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!
భారత్ సైనిక, ఆర్థిక శక్తికి పాక్ ఎప్పటికి సాటిరాదని ఒవైసీ చెప్పారు. పాకిస్తాన్ తన చేష్టలతో అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందన్నారు. భారత్ సైనిక బడ్జెట్ పాక్ జాతీయ బడ్జెట్ కంటే పెద్దదని తెలిపారు. అలాంటి మీరు మాపై దాడులు చేసి అమాయక ప్రజలను చంపేస్తారా అని ఒవైసీ ప్రశ్నించారు. పాకిస్తాన్ పదేపదే తమ వద్ద అణుబాంబులు, ఆటం బాంబులు ఉన్నాయని చెబుతోందని.. వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే, ఏ దేశం మౌనంగా ఉండదని ఒవైసీ హెచ్చరించారు.
మోడీకి ఒవైసీ కీలక సూచన
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒవైసీ కీలక సూచన చేశారు. పాకిస్థాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచే చర్యలు తీసుకోవాలని సూచించారు. కశ్మీర్ లాగే కశ్మీరీలు కూడా ఇండియాలోనే అంతర్భాగమని, వారిని అనుమానించడం సరికాదన్నారు. ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించింది కశ్మీరీయేనని అంతేకాకుండా గాయపడిన చిన్నారిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచి ప్రాణాలు కాపాడింది కూడా కశ్మీరీయేనని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.
Also Read : మావోయిస్టులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు.. కవిత సంచలన వ్యాఖ్యలు!
Also Read : కేసీఆర్ స్పీచ్ లో పస లేదు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్!