/rtv/media/media_files/2025/04/28/oCmwRitoqeXtbLuyUUGn.jpg)
pak-chicken
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలు లక్షలాది మందిని తమ జీవితాలను ఇబ్బంది పెడుతున్నాయి. అక్కడ ధరలు మాములుగా లేవు.. కిలో చికెన్ ధర రూ.800 గా ఉంది. బియ్యం ధర కిలోరూ.340. గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, గుడ్ల ధర డజనుకు రూ.332, పాలు లీటరుకు రూ.224గా ఉంది. ఇక కిలో టమాట రూ. 150గా ఉంది. వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ముందు ఈ ధరలు ప్రస్తుతానితో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ క్షణంలో అయిన భారత్ తో యుద్ధం ప్రారంభం కావొచ్చన్న ఊహాగానలతో ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోయింది.
Also Read : ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి.. ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!
కోటి మందికి పైగా పాకిస్తానీయులు
ఆహార అభద్రత కారణంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉన్నందున పాకిస్తాన్ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉంది. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్ భారత్ తో సైనిక ఘర్షణను భరించగలదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలనుల మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే మాత్రం పాక్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.
Also Read : మావోయిస్టులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు.. కవిత సంచలన వ్యాఖ్యలు!
Also Read : కేసీఆర్ స్పీచ్ లో పస లేదు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్!