/rtv/media/media_files/2025/04/27/kgeMJuQB9qUmHtIJiECb.jpg)
India Vs Pakistan War - Live Updates
India Pakistan War: ప్రపంచంలో అనేక దేశాలు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. అధిపత్య పోరు కోసం చాలా దేశాల్లో అంతర్యుద్ధం కూడా జరుగుతున్నాయి. ఇజ్రాయిల్(Israel), గాజా(Gaza)ల మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుండగా.. ఐరోపాలో రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) దేశాలు గతకొన్ని ఏళ్లుగా యుద్ధం చేస్తున్నాయి. తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితి నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడితో(Pahalgam Terror Attack) పాక్, భారత్ మధ్య ఉన్న పాత వైరం, జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) వివాదం ముదురుతోంది. పాక్ దేశాధినేతలు భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ ముంచుకొస్తోందినే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
అలాగే భారత్‌కు కూడా పాకిస్తాన్‌కు(Pakistan) గట్టి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటుంది. సరిహద్దులో భద్రతా బలగాలను మోహరించాయి. త్రివిధ దళాలు పాక్‌తో పోరుకు సిద్ధంగా ఉన్నాయి. పాక్ మాత్రం అణ్వాయుధాల పేరు చెప్పి ఇండియాను బెదిరిస్తోంది. పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారత్ దేశం పైపు ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసినందుకు పాక్ నాయకులు భారత్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి 130 అణ ఆయుధాలు భారత్‌పైపు సిద్ధంగా ఉన్నాయని అన్నాడు. దీంతో పాక్ యుద్ధం కోసం ఉవ్విళ్లూరుతుందని అర్థమౌవుతుంది.
రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికన్ సైంటిస్ట్స్ ఫెడరేషన్ (FAS) విడుదల చేసిన తాజా స్టేటస్ ఆఫ్ వరల్డ్ న్యూక్లియర్ ఫోర్సెస్ నివేదిక ప్రకారం.. భారత్ దాదాపు 180 అణ్వాయుధాలను కలిగి ఉంది. పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవి హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియం, వెపన్-గ్రేడ్ ప్లూటోనియం ఉపయోగించి తయారు చేసినవి. ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్, కల్పక్కం, కక్రాపర్, నరోరా, పోక్రాన్, రట్టేహళ్లి, తారాపూర్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ట్రాంబే ప్రదేశాల్లో భారత్ అణ్వాయుధాలు నిల్వ చేసింది. యుద్ధం తప్పదనుకుంటే భారత్ న్యూక్లియర్ దాడికి దిగుతుంది. కానీ.. భారత్ అణు విధానం "నో ఫస్ట్ యూస్" (మొదట దాడి చేయకపోవడం). అంటే శత్రువు మొదట అణు దాడి చేస్తేనే భారత్ స్పందిస్తుంది. అందువల్ల భారత్‌తో యుద్ధం అంటే.. అది అణు ఆయుధ దాడిగా మారకపోవచ్చు. ఐతే.. పాకిస్థాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే, భారత్ తప్పకుండా ప్రయోగిస్తుంది. ఆ పరిస్థితిని ప్రపంచ దేశాలు రానివ్వకపోవచ్చు.
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉపయోగించాలంటే ఆదేశ ప్రధాన మంత్రి, అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలి. నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) అణ్వాయుధాల వినియోగంపై అంతిమ అధికారాన్ని కలిగి ఉంటుంది. పాక్ ప్రధాని నేతృత్వంలో ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. పౌర-సైనిక సంస్థ అయిన NCA, అణ్వాయుధాలకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇక భారతదేశంలో అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయం తీసుకునే అధికారం న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (NCA)ది. ఇందులో రెండు విభాగాలు పొలిటికల్ కౌన్సిల్, ఎక్జిక్యూటీవ్ కౌన్సిల్ ఉంటాయి. పొలిటికల్ కౌన్సిల్‌కి ప్రధాన మంత్రి, ఎక్జిక్యూటీవ్ కౌన్సిల్‌కు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అధ్యక్షత వహిస్తారు. భారత్ అణు దాడికి ఆదేశించే అధికారం కలిగిన ఏకైక సంస్థ ఇదే.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
పాకిస్తాన్ న్యూక్లియర్ వార్..
న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలపై పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించదు అనే విధానాన్ని ఫాలో అవుతుంది. అయితే భారత్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. భారీ ప్రతీకారానికి, అణుదాడి జరుగుతుందేమో అని పక్కా సమాచారంతో పాక్ న్యూక్లియర్ దాడి చేయవచ్చని పాక్ అణు విధానంలో ఉంది. అంటే భారత్ కంటే ముందే పాకిస్తాన్ ఇండియాపై న్యూక్లియర్ వార్ చేసే అవకాశం ఉంది. అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా నిరోధకంగా కూడా రూపొందించబడింది. వారు వివిధ ప్రాంతీయ ముప్పులను పరిష్కరించడానికి పూర్తి స్పెక్ట్రమ్ నిరోధక వ్యూహాన్ని అభివృద్ధి చేశారు. గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలను కొనుగోలు చేసిన దేశం భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత పార్లమెంటులో సమర్పించిన రూ. 48 లక్షల కోట్ల బడ్జెట్‌లో రక్షణ రంగానికి అత్యధికంగా రూ.6 లక్షల 22 వేల కోట్ల రూపాయలు, అంటే సుమారు 13 శాతం కేటాయించారు. భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ తన సైనిక ఖర్చు చేస్తోంది.
Also Read: ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!
(india nuclear power | pakistan nuclear power | nuclear-bomb | nuclear war | pakistan | latest-telugu-news | india pak war | india pak war latest news)