Pahalgam Attack సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం కేసు!

ప్రముఖ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. పహల్గామ్ దాడి విషయంలో కేంద్రాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అభయ్ ప్రతాప్ అనే వ్యక్తి ఫిర్యాదుతో లక్నో హజ్రత్‌గంజ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

New Update

 Neha Singh Rathore  ప్రముఖ ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన పోస్టులు దేశసమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ లక్నో హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కవి అభయ్ ప్రతాప్ సింగ్ అలియాస్ అభయ్ సింగ్ నిర్భిక్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 

నేహా పై ఆరోపణాలేంటి?

నేహా సింగ్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అనేక అభ్యంతరకరమైన పోస్టులు చేశారని.. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఆమె పోస్టులు ఉన్నాయని FIR లో పేర్కొన్నారు. పహాల్గమ్ దాడిపై కేంద్రాన్ని తప్పుబడుతూ ఆమె స్టేట్మెంట్స్ సమాజంలో అస్థిరతను వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించారు. అలాగే నేహా సింగ్ ట్వీట్లు పాకిస్తాన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నాయని,  అక్కడి మీడియాలో ప్రచారం చేయబడుతున్నాయని కూడా ఎఫ్‌ఐఆర్‌లో    FIR లో ప్రస్తావించారు. 

నేహా సింగ్ పై భారత శిక్షాస్మృతిలోని 196(1)(a), 196(1)(b), 197(1)(a), 197(1)(b), 197(1)(c), 197(1)(d), 353(1)(c), 353(2), 302, 152 ,  ఐటీ చట్టంలోని సెక్షన్ 69A సహా అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే  దర్యాప్తు ప్రారంభించారు. 

రాజకీయ లబ్ది కోసం.. 

ఇదిలా ఉంటే మరోవైపు నేహా సింగ్ ఆమెపై దేశద్రోహం కేసు పెట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పును ప్రశ్నిస్తే కేసు పెడతారా? అంటూ ఎక్స్  లో పోస్టు పెట్టారు. ''ప్రభుత్వం నాపై FIR నమోదు చేసి.. నిజమైన సమస్యల నుచి ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటోంది. మీకు ధైర్యం ఉంటే, వెళ్ళండి... ఉగ్రవాదుల తలలను తీసుకురండి! పహల్గామ్ దాడి ప్రభుత్వ తప్పిదం.. ఈ దాడిని ప్రభుత్వం బీహార్ ఎన్నికల రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటుందని'' నేహా సింగ్ ఆరోపించారు.

telugu-news | latest-news | cinema-news | singer neha singh rathore

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు