/rtv/media/media_files/2025/03/22/pMLjruH2SQN3tXsph8pX.jpg)
Trump
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని పై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం పేర్కొంది.
ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం.పరిస్థితిన చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరుదేశాలు కలిసి పని చేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.
US Calls India - Pakistan
అయితే ఉగ్రదాడి ని తీవ్రంగా ఖండిస్తున్నామని , ఈ విషయంలో భారత్ కు వాషింగ్టన్ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. అంతకు ముందు ట్రంప్ కూడా దీని పై మాట్లాడుతూ..పహల్గాం దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యను భారత్-పాక్ పరిష్కరించుకుంటాయని తెలిపారు.
ఇదిలా ఉండగా..పహల్గాం ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తోన్న పాక్..దీని పై అంతర్జాతీయ దర్యాప్తు కోరుతున్న సంగతి తెలిసిందే. పాక్ వాదనను చైనా కూడా సమర్థిస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రివాంగ్ యూ..పాక్ విదేశీ వ్యవహారాల మంత్రితో ఫోన్ లో మాట్లాడారు.ఇరు దేశాల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పిన చైనా మంత్రి..ఉగ్రదాడి పై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని పాక్ కు హామీ ఇచ్చారు.
Also Read: Pakistan-Bharat: భారత్ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Also Read: TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!
trump | america | Pahalgam attack | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates