/rtv/media/media_files/2025/04/28/IMDgPi9Lxbhx6YCcsvV1.jpg)
Pakistan moving terrorists into bunkers after India zeroes in on launch pads, Sources
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో పాకిస్థాన్‌కు భారత్ సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సైన్యం.. పీవోకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. వాళ్లని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది.
Also Read: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
దీని ప్రకారం.. భారత భద్రతా సంస్థలు యాక్టివ్‌గా ఉన్న పలు లాంచ్ ప్యాడ్‌లను గుర్తించాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ దీనిపై చర్యలు తీసుకుంటోంది. పీఓకేలోని కెల్, సర్ది,అత్ముఖం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా,దుధ్నియల్,కొట్లి వంటి పలు ప్రాంతాల నుంచి టెర్రలిస్టులను తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఉగ్రవాదులకు జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు వాళ్లు ఉండే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్‌ప్యాడ్‌లు పనిచేస్తాయి. వీటిలో దాదాపు 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని.. వాళ్లందరూ చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: ముఖ్యమంత్రి ఓవరాక్షన్.. స్టేజ్ మీదే IPS చెంపపై కొట్టబోయిన (VIRAL VIDEO)
ఇదిలాఉండగా ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రదాడులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై భారత్ నడుం బిగించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులను తక్షణమే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో పాక్ కూడా సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు పర్మిషన్ కూడా నిలిపివేస్తున్నామని పేర్కొంది.
Also Read: రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లు: ఎలాన్ మస్క్
telugu-news | rtv-news | national-news | Pahalgam attack