CM Omar Abdullah: ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి..  ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!

పహల్గామ్ దాడికి సంబంధించి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో సోమవారం చాలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత తాను పూర్తి రాష్ట్ర హోదాను ఎలా అడగగలనని ఆయన అన్నారు.

New Update
CM-Omar-Abdullah

CM-Omar-Abdullah

CM Omar Abdullah: పహల్గామ్ దాడికి(Pahalgam Terror Attack) సంబంధించి జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో సోమవారం చాలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత తాను పూర్తి రాష్ట్ర హోదాను ఎలా అడగగలనని ఆయన అన్నారు. ఈ దాడికి సంబంధించి జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ఆ 26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకొని తాను ఇప్పుడు  రాష్ట్రహోదాను డిమాండ్‌ చేయబోనని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర హోదా అడగటం భావ్యం కాదన్న ఒమర్‌ అబ్దుల్లా... మరో సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ భద్రత బాధ్యత ప్రస్తుతం తన ప్రభుత్వానికి లేకపోయినా, ఈ సందర్భంగా తాను ఎలాంటి రాజకీయాలు చేయనని అన్నారు. 

Also Read: నాలుగు ముక్కలుగా పాకిస్తాన్!

Also Read: Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌‌అండ్‌‌టీ

ప్రజల హృదయాలపై గాయం : CM Omar Abdullah

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు పహల్గామ్‌కు వచ్చారని.. అలాంటి సమయంలో ఇలాంటి ఉగ్రదాడి జరగడం చాలా సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.  ఇది కశ్మీరీ ప్రజల హృదయాలపై ఒక గాయంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీ ప్రభుత్వం నుండి పూర్తి రాష్ట్ర హోదాను తాను డిమాండ్ చేయనని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం నిర్ణయాత్మక పోరాటం చేయాలని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.  దోషులను కఠినంగా శిక్షించాలని వారిపై కనికరం చూపవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!

అంతకుముందు పహల్గామ్ దాడిలో మరణించిన 26 మందికి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులతో పాటుగా ఓ విదేశీయుడు మరణించారు. ఉగ్రవాదుల పిరికి చర్యకు వ్యతిరేకంగా ఏప్రిల్ 23న జమ్మూ & కశ్మీర్ ప్రజలు ఐక్యంగా ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బంద్ పాటించారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన తొలి బంద్ ఇది.

Also Read: Pahalgam Attack: బంగ్లా అధికారితో పహల్గాం ఉగ్రవాదుల భేటీ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు