-
Dec 12, 2024 21:45 IST
కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
కేరళలోని పాలక్కడ్‌లో లారీ అతివేగం వల్ల నలుగురు విద్యార్థులు స్పాట్‌లో మృతి చెందారు. అతివేగంతో వచ్చిన లారీ అదుపు తప్పి, బస్సు కోసం ఆగి ఉన్న నలుగురు విద్యార్థులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : https://rtvlive.com/crime/kerala-palakkad-lorry-accident-four-students-are-spot-dead-8436148
-
Dec 12, 2024 21:38 IST
జమిలి ఎన్నికల బిల్లు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిఘటించాలంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
-
Dec 12, 2024 21:20 IST
రీల్స్ కోసం స్టంట్.. రైలు నుంచి జారిపడిన యువతి!
చైనాకి చెందిన ఓ యువతి శ్రీలంకలో రైళ్లలో ప్రయాణిస్తూ రీల్ కోసం స్టంట్ చేసింది. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగిలి ట్రైన్ నుంచి కింద జారిపడింది. కొంత సమయం తర్వాత స్నేహితులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను రక్షించగా.. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది.
Also Read : https://rtvlive.com/viral/sri-lanka-in-young-woman-falls-off-train-while-performing-reels-stunt-8436063
-
Dec 12, 2024 20:31 IST
వామ్మో.. చెస్ ఛాంపియన్ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !
తమిళనాడుకు చెందిన గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గుకేశ్ ఈ ఆటలో గెలవడంతో అతడికి మొత్తం 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది.
-
Dec 12, 2024 20:28 IST
పదేళ్ళ కల సాకారం అయింది–గుకేశ్
అతిచిన్న వయసులో ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌గా నిలిచాడు దొమ్మరాజు గుకేశ్. దీంతో తన పదేళ్ల కల సాకారం అయిందని చెబుతున్నాడు. ఈ క్షణం కోసం తాను ఎంతగానో ఎదురు చూశానని చెప్పాడు. మరోవైపు గుకేశ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ .
Also Read : https://rtvlive.com/sports/this-is-my-10-years-dream-says-world-chess-champion-gukesh-after-winning-8435943
-
Dec 12, 2024 20:26 IST
యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం
18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ రికార్డ్ సృష్టించారు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
-
Dec 12, 2024 20:10 IST
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలు చేశారు. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
-
Dec 12, 2024 18:26 IST
వైసీపీ నేత లైంగిక వేధింపులు.. ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు!
గుంటూరు వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడని ఓ బాధిత మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకి సైనేడ్ లేదా కుక్కల ఇంజెక్షన్ ఇచ్చి చంపమన్నాడని తెలిపింది. ఇలా చేయకపోవడం వల్ల తన భర్తపై దాడి చేశాడని ఆమె వెల్లడించింది.
-
Dec 12, 2024 18:21 IST
ధరణి సేవలు బంద్
ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు ఇది జరగనుంది. దీంతో నాలుగు రోజుల పాటు ధరణి సేవలు అందుబాటులో ఉండవు.
Also Read : https://rtvlive.com/telangana/dharani-portal-to-be-temporarily-unavailable-for-4-days-8435585
-
Dec 12, 2024 18:00 IST
ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!
రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకార క్యూట్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. క్లీంకార తన తాత, ముత్తాతలతో కలిసి ఆలయాన్ని సందర్శించింది. ఈ ఫొటోను ఉపాసన షేర్ చేస్తూ.. 'తాత చేతుల్లో క్లీంకారను చూస్తుంటే నా బాల్యం గుర్తుకొస్తుంది' అంటూ పోస్ట్ పెట్టారు.
-
Dec 12, 2024 17:26 IST
విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఆన్ లైన్, ఆఫ్‌లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాలెడ్జి సొసైటీ మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
-
Dec 12, 2024 17:03 IST
తెలంగాణ చరిత్రలో తొలిసారి.. మహిళా సంఘాలకు యూనీఫాం!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా యూనిఫాం చీరలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా డిజైన్లతో రూపొందించిన చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా అందించనున్నారు.
Also Read : https://rtvlive.com/telangana/telangana-mahila-samakya-uniform-sarees-telugu-news-8435341
-
Dec 12, 2024 16:49 IST
తెలంగాణలో 60 వేలమంది ప్రేమికులు మిస్సింగ్.. వెలుగులోకి సంచలన నిజాలు
గత ఏదేళ్లలో తెలంగాణలో లక్షమందిపైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 60 వేలకు పైగా ప్రేమికులే ఉండటం గమనార్హం. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Also Read : https://rtvlive.com/telangana/1-lakh-puls-missing-cases-recorded-in-telangana-over-5-years-8435245
-
Dec 12, 2024 16:20 IST
మనోజ్‌కే మంచు లక్ష్మీ సపోర్ట్.. తండ్రి, సొంత తమ్ముడిని కాదని..
మంచు ఫ్యామిలీలో గొడవలు రోజురోజుకీ పెరుగుతున్నా.. ఇప్పటికీ మంచు లక్ష్మీ డైరెక్ట్‌గా స్పందించలేదు. తండ్రి, సొంత తమ్ముడిని కాదని మనోజ్‌కి సపోర్ట్ చేస్తుంది. తండ్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా లక్ష్మీ పెడుతోంది.
Also Read : https://rtvlive.com/cinema/manchu-lakshmi-supports-manoj-not-his-father-or-his-own-brother-8435099
-
Dec 12, 2024 16:16 IST
రైతుకు బేడీలు.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్!
ఓ రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.
Also Read : https://rtvlive.com/telangana/cm-revanth-serious-about-bedis-for-farmers-telugu-news-8432423
-
Dec 12, 2024 16:14 IST
కీర్తి సురేష్ పెళ్ళిలో విజయ్, నాని సందడి.. ఈ ఫొటోలు చూశారా!
నటి కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
-
Dec 12, 2024 15:53 IST
మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బాండ్ ఓవర్!
మంచు ఫ్యామిలీ ఫైట్‌పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు కుటుంబ గొడవ వారి వ్యక్తిగతమని చెప్పారు. మంచు మనోజ్ ను ఏడాదిపాటు బాండ్ ఓవర్ చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీలనుంచి బాండ్ ఓవర్ తీసుకోవడం ఇదే తొలిసారి అన్నారు.
-
Dec 12, 2024 14:50 IST
ఈ సమావేశాలల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేవారమే ఈ బిల్లు ప్రవేశపెట్టనునన్నట్లు తెలుస్తోంది.
Also Read : https://rtvlive.com/national/one-nation-one-election-likely-to-present-this-parliament-session-8432325
-
Dec 12, 2024 14:42 IST
ఘనంగా నటి కీర్తి సురేష్ పెళ్లి.. ఫొటోలు వైరల్
నటి కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : https://rtvlive.com/cinema/actress-keerthi-suresh-marriage-photos-viral-telugu-news-8432300
-
Dec 12, 2024 13:05 IST
BREAKING: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ!
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి కార్యాచరణను అల్లు అర్జున్ ప్రకటించనున్నట్లు సమాచారం.
https://rtvlive.com/cinema/icon-star-allu-arjun-to-enter-into-politics-8431973
-
Dec 12, 2024 13:04 IST
Breaking: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్ గఢ్ అబూజ్ మడ్ అడవిప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
https://rtvlive.com/crime/encounter-in-chhattisgarh-12-maoists-killed-telugu-news-8432010
-
Dec 12, 2024 12:50 IST
AP Crime: కూతురు ఫోన్.. కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి
తండ్రి కూతుర్ల బంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకి ఎలాంటి కష్టం రాకుండా తండ్రి చూసుకుంటాడు. ఓ వ్యక్తి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని హతమార్చడానికి ఏకంగా కువైట్ నుంచి వచ్చాడు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతుంది.
-
Dec 12, 2024 11:50 IST
BREAKING: ఒకేరోజు జగన్‌కు మూడు బిగ్ షాకులు!
AP: జగన్‌కు సొంత పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
https://rtvlive.com/andhra-pradesh/shock-for-jagan-another-ycp-ex-mla-to-resign-ycp-8431808
-
Dec 12, 2024 11:36 IST
లగచర్ల అల్లర్ల కేసు.. మరో వివాదంలో రేవంత్ సర్కార్
TG: లగచర్ల అల్లర్ల ఘటనలో అరెస్టై జైలులో ఉన్న రైతుకు గుండెపోటు వచ్చింది. వీర్యా నాయక్‌కు గుండెపోటు రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైతు ఆరోగ్యంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
https://rtvlive.com/telangana/kodangal-lagacharla-farmer-got-heart-attack-in-jail-8431732
-
Dec 12, 2024 10:23 IST
BIG BREAKING: జగన్‌కు చంద్రబాబు సర్కార్ భారీ షాక్!
AP: జగన్‌కు చంద్రబాబు సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక తహసీల్దార్ తెలిపారు.
https://rtvlive.com/andhra-pradesh/chandrababu-government-gave-big-shock-to-jagan-8431572
-
Dec 12, 2024 08:26 IST
BIG BREAKING: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్!
AP: మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
-
Dec 12, 2024 08:03 IST
BREAKING: మంచు లక్ష్మి సంచలన పోస్ట్!
మోహన్ బాబు కుటుంబలో విభేదాలు బగ్గుమ్మన్న వేళ మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తన ట్విట్టర్ లో.."ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు.. ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అనే సందేహాన్ని పోస్ట్ చేసింది.
https://rtvlive.com/cinema/manchu-laksmi-makes-post-in-twitter-on-manchu-family-issue-8431357
-
Dec 12, 2024 07:51 IST
BIG BREAKING: మోహన్ బాబుకు బిగ్ షాక్
నటుడు మోహన్ బాబు చిక్కిల్లో పడ్డారు. ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. ఓ మీడియా ఛానెల్ ప్రతినిధిపై చేసిన దాడి కేసులో ఆయనపై BNS 109 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు.
https://rtvlive.com/cinema/big-shock-for-mohan-babu-criminal-case-registered-8431343
-
Dec 12, 2024 06:48 IST
HYD: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్
ఫ్యామిలీ మ్యాటర్స్ రోడ్డు మీదకు తీసుకురావడంపై మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంలో విష్ణుకు గంటన్నసేపు క్లాస్ పీకారు సీపీ. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు.
https://rtvlive.com/telangana/hyderabad/rachakonda-cp-warned-manchu-vishnu-yesterday-night-8431305
🛑LIVE BREAKING: కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
New Update
తాజా కథనాలు