Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ!

అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి కార్యాచరణను అల్లు అర్జున్ ప్రకటించనున్నట్లు సమాచారం.

New Update
aa politics

Allu Arjun: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ఫెమస్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే రాజకీయాల్లో వస్తారనే చర్చ జోరందుకుంది. ఇందుకోసం అల్లు వారు పలువురు నేతలతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేని అల్లు ఫ్యామిలీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో అల్లు అర్జున్ కు ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేశారట.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో కుటుంబం బలి

ముందు ప్రజాసేవ...

రాజకీయాల్లోకి రావాలంటే ఉన్న సినిమా హీరో ఫెమ్ ఒకటే సరిపోదని అర్జున్ తో PK చెప్పినట్లు తెలుస్తోంది. ముందు ఏదైనా సోషల్ సర్వీస్ కార్యక్రమాలు ప్రారంభించాలని సుచాలను చేసినట్లు తెలుస్తోంది. అయితే పీకే ఇచ్చిన సూచనలు అమలు చేయాలని బన్నీ నిర్ణయం తీసుకున్నారట. కేవలం రాజకీయాలు కోసమే కాకుండా ప్రజాసేవ చేయడం ద్వారా అల్లు ఫ్యామిలీ పేరు, ఖ్యాతి పెరుగుతుందని భావించారట. ఈ క్రమంలోనే అల్లు ఫ్యామిలీ త్వరలో సోషల్ సర్వీస్ లను ప్రారంభించనున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: కూతురు ఫోన్.. కువైట్‌ నుంచి వచ్చి చంపిన తండ్రి

చిరంజీవి స్ఫూర్తిగా..!

గతంలో చిరంజీవి రాజకీయాలకు వచ్చే ముందు బ్లడ్ బ్యాంకు పెట్టినట్లు గానే పుష్ప రాజ్ కూడా బ్లడ్ బ్యాంకు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సోషల్ సర్వీసెస్ చేస్తున్న క్రమంలోనే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడున్న పార్టీలలో ఎదో ఒకదానిలో చేరుతారా? లేదా సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి. ప్రశాంత్ కిషోర్ తో జరిగిన  భేటీలో అల్లు అర్జున్, బన్నీ వాసు, ఓ పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అటు సోషల్ మీడియా ఈ వార్త వైరల్ కావడంతో అల్లు ఫ్యామిలీ స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. అవన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ వస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: 74 ఏళ్లు పూర్తిచేసుకున్న తలైవా.. బర్త్‌ డే స్పెషల్‌

ఇది కూడా చదవండి:  ఛత్తీస్​గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు