విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఆన్ లైన్, ఆఫ్‌లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాలెడ్జి సొసైటీ మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

New Update
CM Chandrababu

'నాలెడ్జి సొసైటీ మన ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మానవ వనరులశాఖపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ''ఆన్ లైన్, ఆఫ్‌లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలి. ప్రైవేటు విద్యావ్యవస్థను తొక్కేయడం మన విధానం కాదు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయం.

Also Read: తెలంగాణలో 60 వేలమంది ప్రేమికులు మిస్సింగ్.. వెలుగులోకి సంచలన నిజాలు

రాబోయే రోజుల్లో నాలెడ్జి ఎకానమీలో తెలుగు విద్యార్థులు నెం.1గా నిలవాలి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రత్యేక బృందాలను పంపి అక్కడ బోధన, అభ్యసన పద్ధతులపై అధ్యయనం చేయాలి. తదనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేసి, ఎన్ఐఆర్ఎఫ్, గ్లోబల్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. సివిల్ ఏవియేషన్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో భవిష్యత్ అవకాశాలను అంచనావేసి ఆయా యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 

Also Read: మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బాండ్ ఓవర్!

స్కిల్స్, ఎంప్లాయ్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఇందుకోసం అమరావతి రాజధానిలో ఏర్పాటుచేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో రాష్ట్రంలోని 5జోన్లలోని స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను అనుసంధానిస్తాం. డిజిటల్ టీచింగ్, లెర్నింగ్‌పై దృష్టిసారించాలి. సొసైటీ అవసరాలను బట్టి స్కిల్ అప్‌గ్రెడేషన్ చేపట్టాలి. ఒకేషనల్ విద్యపై దృష్టిసారించాలి. పాఠశాలల్లో రేటింగ్ మెరుగుదలకు కలెక్టివ్ టీమ్ బిల్డింగ్‌తో ర్యాంక్సింగ్స్ మెరుగుదలకు కృషిచేసి, విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులంతా కృషిచేయాలని'' సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read :  ఇంకోసారి అలా రాస్తే ఊరుకునేది లేదు.. సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్

Also Read :  రోజుకు రూ.2 లక్షలు.. ఏఈ నిఖేశ్‌కుమార్‌ అక్రమార్జనలో సంచలనాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు