బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ప్రయాణించే శ్రీవారి భక్తులతో పాటు వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని ఆమె కోరారు.
ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!
ముందుస్తు జాగ్రత్తలు..
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. ఘాట్ రోడ్లు, కొండచరియలున్న ప్రాంతాల్లో ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇది కూడా చూడండి: US: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్!
ఎప్పటికప్పుడు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులను ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి ఆదేశించారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం ఉధృతంగా ప్రవహించడం సహా తిరుపతి జిల్లాలోని సూళ్లూరు, కాళంగి గేట్లు ఎత్తివేత నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్
ఇదిలా ఉండగా తిరుమలలో భారీ వర్షాల నేపథ్యంలో మాడా వీధులతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అలాగే అప్రమత్తమైన అధికారులు భక్తులకు వసతి,దర్శనం, ప్రసాదాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండ చరియలు జారీ పడే ప్రాంతాల్లో అధికారులు నిఘాను పెంచారు.
ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!