Gukesh: వామ్మో.. చెస్‌ ఛాంపియన్‌ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !

తమిళనాడుకు చెందిన గుకేశ్‌ దొమ్మరాజు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గుకేశ్‌ ఈ ఆటలో గెలవడంతో అతడికి మొత్తం 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్‌ మనీ రానుంది.

New Update
CHESS

తమిళనాడుకు చెందిన గుకేశ్‌ దొమ్మరాజు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన డిఫెండింగ్‌ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌తో జరిగిన చివరి పోరులో గుకేశ్ విజయం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్‌ 5 సార్లు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ సొంతం చేసుకోగా.. ఆయన తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న రెండో భారత చెస్‌ ప్లేయర్‌గా గుకేశ్‌ రికార్డు సృష్టించాడు. 

Also Read: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్

Chess Player Gukesh Dommaraju

ఇలాంటి అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్‌కు మరి ఎంత ప్రైజ్‌ మనీ రానుందనే దానిపై చర్చ నడుస్తోంది. 25 లక్షల డాలర్ల విలువైన ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ 2024లో ప్రతీ క్లాసికల్‌ గేమ్‌లో విజేతకు 2 లక్షల డాలర్ల(1.69 కోట్లు) ప్రైజ్‌మనీ అందిస్తారు. అయితే గుకేశ్‌ దొమ్మరాజు.. మూడు ఆటలు గెలిచాడు. కాబట్టి అతనికి మొత్తం 6 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.07 కోట్ల ప్రైజ్‌మనీ రానుంది. ఇక చైనాకు చెందిన లిరెన్‌ రెండు ఆటలు గెలవడంతో అతనికి 4 లక్షల డాలర్లు (రూ.3.38 కోట్లు) రానున్నాయి. 

Also Read: కేంద్రం స్పందించేవరకూ ఆగండి..ప్రార్థనా స్థలాల కేసులో సుప్రీంకోర్టు

ఇక మిగతా 15 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని కూడా ఫైనల్‌లో ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లకే సమానంగా పంచుతారు. గుకేశ్‌ మూడు ఆటలు గెలవడంతో అతడికి మొత్తం 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్‌ మనీ రానుంది. ఇక చైనాకు చెందిన లిరెన్‌ రెండు ఆటలు గెలవడంతో అతడికి 11.5 లక్షల డాలర్లు (రూ.9.75 కోట్లు) రానున్నాయి.    

Also Read :  యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం

ఇదిలాఉండగా ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ సాధించిన అతిపిన్న వయస్కుడిగా కూడా గుకేశ్ రికార్డు సాధించాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే వరల్డ్‌ ఛాంపియన్‌గా సత్తా చాటాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు గుకేశ్‌ కావడం విశేషం. తమిళనాడులో జన్మించిన గుకేశ్‌ తెలుగు కుటుంబానికి చెందినవాడే. 

Also Read: తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు