ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలని చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి మరి రీల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి విన్యాసాలు చేయడం ఓ ట్రెండ్‌లా మారిపోయింది. రీల్స్ కోసం స్టంట్‌లు చేస్తూ ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మాత్రం మానడం లేదు. అయితే తాజాగా ఓ యువతి రీల్స్ కోసం పోజు ఇస్తూ.. రైలు నుంచి కిందపడి పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం! A Chinese tourist had a heart-stopping moment while traveling on Sri Lanka's coastal railway line. She fell from the train after being struck by a tree branch while trying to record a video.Fortunately, she landed on a bush, which broke her fall and miraculously left her… pic.twitter.com/GmKnViyC0U — Daily Sherlock 🇬🇭 🇺🇸 (@dailysherlock0) December 12, 2024 ఇది కూడా చూడండి: US: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్! చెట్లు కొమ్మలు తగలడంతో.. వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ యువతి ఇటీవల శ్రీలంకుకు విహారయాత్రకు వెళ్లింది. శ్రీలంకలో ఓ రైళ్లలో ప్రయాణిస్తూ.. బోగి డోర్ దగ్గర రెండు చేతులు పట్టుకుంటూ వెనక్కి తల పెట్టి పోజు ఇచ్చింది. కొన్ని సెకన్లు అలానే ఉన్నా.. మధ్యలో చెట్లు కొమ్మలు వచ్చాయి. వీటికి తగిలి ఆ యువతి రైలు నుంచి పడిపోయింది. వెంటనే రైలును ఆపి ఘటనా స్థలానికి వచ్చి ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ఆ యువతి ప్రమాదం నుంచి బయటపడింది. ఇలాంటి రీల్స కోసం ఇలాంటి విన్యాసాలు చేసి ప్రాణాలు తీసుకోవద్దుని అధికారులు సూచించారు. ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్ ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!