తెలంగాణ చరిత్రలో తొలిసారి.. మహిళా సంఘాలకు యూనీఫాం!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా యూనిఫాం చీరలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. సీఎం రేవంత్ చేతులమీదుగా అందించనున్నారు.

author-image
By srinivas
New Update
rererre

TG News: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా ఈ యూనిఫాం చీరలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ యూనిఫాం చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించగా వీటిని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ గురువారం  మంత్రి సీతక్కకు చూయించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో యూనిఫామ్ చీరల డిజైన్లను ఖరారు చేసి మహిళలకు అందించనున్నారు. అయితే ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లోని మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహం..

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థికాభివృద్ధి కోసం 'మహిళాశక్తి' పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద వచ్చే ఐదేళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించనుంది. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని కోటీశ్వర్లును చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇందులో భాగంగానే చీరల కోడ్ ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: మనోజ్‌కే మంచు లక్ష్మీ సపోర్ట్.. తండ్రి, సొంత తమ్ముడిని కాదని..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు