/rtv/media/media_files/2024/12/12/Tkli3E0HeAh8c7upWXex.jpg)
Klin Kaara photo
Klin Kaara photo: మెగా ప్రిన్సెస్ క్లీంకార తాత, ముత్తాతలతో కలిసి ఆలయాన్ని సందర్శించింది. ఈరోజు అపోలో హాస్పిటల్ లోని టెంపుల్లో జరిగిన వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన తాతలతో కలిసి పాల్గొంది. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటోను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఉపాసన ఈ ఫొటోను షేర్ చేస్తూ.. క్లీంకార తాత చేతుల్లో చూస్తుంటే నా బాల్యం గుర్తుకు వస్తుంది అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు చిన్ని క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది అంటూ హార్ట్ ఇమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫొటోలో కూడా ఉపాసన ఫేస్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!
Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!