CM Chandrababu: వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. పల్నాడు జిల్లాలో ఆయనకు సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా ఇదే అంశంపై వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా? జగన్, షర్మిల మధ్య చిచ్చు..! జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌పై కీలక విషయాలు బయటకు వచ్చాయి. సరస్వతి కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఆ కంపెనీ వెనుక జరిగిన అవకతవకలపై త్వరలో సీఐడీ విచారణకు ఆదేశాలిచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల సరస్వతి పవర్ ఇండస్ర్టీస్‌పై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ పెట్టారు. ఆ కంపెనీకి సంబంధించిన 1500 ఎకరాల భూముల్లో ప్రభుత్వ భూములున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో వీటిపై సర్వేచేయాలని అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ! కాలుష్య మండలిని పవన్ ఆదేశించినట్లు.. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. అందులో కొంత ప్రభుత్వ, కొండ పోరంబోకు, చుక్కల భూములు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదికను పవన్‌కు అధికారులు సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే సరస్వతి కంపెనీకి చెందిన పర్యావరణ అనుమతులపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని పవన్ ఆదేశించారు. ఈ అంశాలపై అటవీ, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా అధికారులు దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి.. తిరిగి వెనక్కి తీసుకున్నారు. అయితే అక్రమంగా తీసుకున్న ఈ భూమిపై జగన్ పై చర్యలు ఉంటాయనే వాదన రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది.