జమిలి ఎన్నికల బిల్లు.. స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిఘటించాలంటూ ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.

New Update
Stalin

వన్ నేష్-వన్ ఎలక్షన్‌ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక పార్లమెంటులో ప్రవేశపెట్టడమే ఆలస్యం. ఆ వారమే జమిలి ఎన్నికల బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెటనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిల్లును కొన్ని పార్టీలు సమర్థిస్తుంటే కాంగ్రెస్‌తో సహా మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: వామ్మో.. చెస్‌ ఛాంపియన్‌ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !

జమిలి ఎన్నికలు భారత సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు.ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం క్రూరమైన చర్య అంటూ ధ్వజమెత్తారు. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని ప్రజలందరూ ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.    

Also Read: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్

'' జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర కేబినెట్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఈ నిర్ణయం దేశంలో ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేసేలా ఉంది. మనమందరమూ దీన్ని ప్రతిఘటించాలి'' అంటూ స్టాలిన్‌ పేర్కొన్నారు.  ఇదిలాఉండగా.. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ మీటింగ్‌లో జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. మరోవైపు డిసెంబర్ 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాయి. 

Also Read: కేంద్రం స్పందించేవరకూ ఆగండి..ప్రార్థనా స్థలాల కేసులో సుప్రీంకోర్టు

Also Read: వీసా లేకున్నా ఆ దేశంలో 60 రోజులు ఉండొచ్చు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు