Avanti Srinivas: మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీలో నేతల రాజీనామాల పర్వానికి ఫుల్ స్టాప్ పడలేదు. తాజాగా మరో కీలక నేత వైసీపీ కి వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా? ఓడిపోయిన నాటి నుంచి అటు అధిష్టానానికి, అలాగే తన క్యాడర్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు అవంతి శ్రీనివాస్. అయితే రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. వైసీపీ రాజీనామా చేసే అంశంతో పాటు కీలక విషయాలను చెప్పేందుకు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెబుతారో వేచి చూడాలి. మరోవైపు ఆయన టీడీపీ లో చేరుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీలోని ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. Also Read: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం..! ప్రజారాజ్యం నుంచి మొదలు... అవంతి శ్రీనివాస్ రాజకీయ జీవితం 2009లో ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభమైంది. చిరంజీవి ఆయనకు భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాగా 2014 వరకు అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019లో వైసీపీ లో చేరారు. భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై విజయం సాధించారు. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో రెండున్నరేండ్ల మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు! Also Read: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్