AP Crime: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగపేటలో గట్టు ఆంజనేయులు నివాసం ఉంటున్నాడు. అయితే తాజాగా అతడు మృతి చెందగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యకు గల కారణం కువైట్ నుంచి వచ్చి వ్యక్తి హతమార్చినట్టు తాజాగా వెలుగులోకి నిజాలు వచ్చాయి. తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న కోపంతో కువైట్ నుంచి వచ్చి ఆంజనేయుని అనే వ్యక్తిని హతమార్చి మళ్లీ తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని..
బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. కొత్తమంగంపేట చెందిన చంద్రకళ, భర్త ఆంజనేయప్రసాద్ కువైట్‌లోఉంటున్నారు. వీరి కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతులు వద్ద ఉంచారు. వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాత మాట్లకు బాధపడిన చిన్నారి ఈ విషయాన్ని తల్లి చంద్రకళకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడిగినా సరిగా స్పందించలేదు. టెన్షన్‌తో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: 74 ఏళ్లు పూర్తిచేసుకున్న తలైవా.. బర్త్ డే స్పెషల్
కేసుపై స్పందించిన పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించారు. చంద్రకళ ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పటంతో తీవ్ర ఆవేదనకు గురైన అతడు.. ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా వ్యక్తిపై ఆవేదన చెందాడు. కోపంలో రగిలిపోయినా. అతడు కువైట్ నుంచి వచ్చి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని నిందితుడు తెలిపాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకపోవటం వలన ఈ హత్య చేశానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా?