గుంటూరు వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అరాచకాలను.. బాధితరాలు మరోసారి మీడియాకు వివరించింది. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంకు చెందిన దేవరకొండ నాగేశ్వరరావు లైంగికంగా వేధించడంతో పాటు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వేధిస్తున్నాడని లక్ష్మీ అనే బాధితరాలు గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. లక్ష్మీ భర్త అడ్డుగా ఉన్నాడని అతనికి సైనేడ్ ఇచ్చి చంపాలని నాగేశ్వరారావు ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపింది.
ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!
సైనేడ్ ఇచ్చి చంపమని..
గతంలో ఓ భిక్షగాడికి సైనేడ్ ఇచ్చి చంపాడని, ఆ ఘోరాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశాడట. ఆ వీడియోనే లక్ష్మీకి చూపించి అదే విధంగా తన భర్తను చంపమని చెప్పాడని లక్ష్మీ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ తన భర్తకు ఇవ్వమని ఒత్తిడి చేశాడు. ఇంజక్షన్ ఇవ్వకపోవడంతో తన భర్తపై దాడి చేసినట్లు ఆమె తెలిపింది.
ఇది కూడా చూడండి: US: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్!
ఇలా చెప్పుకుంటూ పోతే నాగేశ్వరరావు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది. నాగేశ్వరరావు చేసిన హత్యలు, అరాచకాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆమె కోరింది. గతంలో చంద్రబాబు ప్రచార రధం సమయంలో రాళ్లు విసిరిన ఘటనలో కూడా నాగార్జున పాత్ర ఉందని, అలాగే టీడీపీ కార్యాలయం ఘటనలో కూడా నాగేశ్వరరావు పాత్ర ఉందని ఆమె తెలిపింది.
ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్
దేవరకొండ నాగేశ్వరరావు వెంగళాయపాలెంలో ఎన్నో కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆమె చెబుతోంది. గ్రామంలో రోడ్డు పక్కన వాగు పోరంబోకులో ఉన్న ప్లేస్‌లో ఎవరి అనుమతి లేకుండా ఇంటిని నిర్మించాడట. కొన్ని రోజులు వైసీపీ కార్యాలయాన్ని కూడా నిర్వహించాడని బాధిత మహిళ తెలిపింది. ఎన్ని నేరాలు చేసిన కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదని, కనీసం పట్టుకునేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదని బాధిత మహిళ తెలిపింది.
ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!