Manchu Lakshmi: మోహన్ బాబు కుటుంబలో విభేదాలు బగ్గుమ్మన్న వేళ మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తన ట్విట్టర్ లో.."ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు.. ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు" అనే సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే ఆమె ఎవరికీ మద్దతుగా పోస్ట్ చేసింది అనేది తెలియాల్సి ఉంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం చూస్తే.. తన తమ్ముడు మంచు మనోజ్ కు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ గొడవకు స్వస్తి పలకాలని చెప్పినట్లు కనిపిస్తోంది. అయితే మంచు లక్ష్మి పెట్టిన పోస్టుపై నెటిజన్లు అనేక చర్చలు పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో మంటలను మంచు లక్ష్మి చల్లారుస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. Also Read: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..! pic.twitter.com/Ym8Oq1kZU3 — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 12, 2024 Also Read: మోహన్ బాబు కుటుంబ వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు! అక్కతో ఇస్యూస్ అంటూ.. మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలపై మంచు విష్ణు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఎప్పుడు తన కుటుంబం గురించి ప్రెస్ మీట్ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉండడం సహజమే అని అన్నారు. కానీ అవి ఇంటి వరకే పరిమితం అయితే బాగుటుందని.. తాము కూడా తమ కుటుంబంలో నెలకొన్న విభేదాలను ఇంట్లోనే పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తనకు కూడా తన అక్క మంచు లక్ష్మితో కూడా ఇస్యూస్ ఉన్నాయని చెప్పారు. కానీ తాము మర్యాద పూర్వకంగా నడుచుకుంటామని తెలిపారు. తన అక్క తనకంటే పెద్దదని.. ఆమె చెప్పిన కొన్ని విషయాలను నేను పాటిస్తానని అన్నారు. కానీ ఏనాడూ కుటుంబలో చీలికలు రావాలని కోరుకోలేదని అన్నారు. Also Read: మోహన్ బాబుకు బిగ్ షాక్ Also Read: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్!