మంచు కుటుంబంలో వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఆస్తుల విషయంలో తండ్రి మోహన్ బాబుకి కొడుకు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదు చేశారు. ఈ గొడవల్లో మంచు విష్ణు తన తండ్రికే సపోర్ట్‌గా ఉంటూ మనోజ్‌కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం! ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్‌లు చేస్తూ.. ఇదంతా పక్కన పెడితే.. మంచు కుటుంబంలో ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా లక్ష్మీ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్‌లు మాత్రం చేస్తోంది. చూస్తుంటే మంచు లక్ష్మీ సపోర్ట్ మనోజ్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మనోజ్ మౌనిక పెళ్లి సమయంలో కూడా మోహన్ బాబు కుటుంబంలో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మంచు లక్ష్మీనే కుటుంబ పెద్దగా ఉంటూ పెళ్లి చేసింది. ఇది కూడా చూడండి: US: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్! నిజానికి మంచు లక్ష్మీ, విష్ణు ఒక తల్లి బిడ్డలు. మనోజ్ రెండో బార్యకు పుట్టిన కొడుకు. ఈ పరంగా చూసుకుంటే లక్ష్మీ సపోర్ట్ మనోజ్ కంటే విష్ణుకే ఉండాలి. కానీ లక్ష్మీ సపోర్ట్ మాత్రం మనోజ్‌కే ఉంది. తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పెట్టింది. ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు ఏదో కోల్పోతారన్న బాధ ఎందుకని కొటేషన్‌ను ఆమె పోస్ట్ పెట్టింది. దీని బట్టి చూస్తే లక్ష్మీ డైరెక్ట్‌గా మనోజ్‌కి సపోర్ట్ చేసినట్లు స్పందించకపోయిన ఆమె ఫుల్ సపోర్ట్ మాత్రం మనోజ్‌కే అని తెలుస్తోంది. ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్ మోహన్‌బాబు మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.589 కోట్లు ఉంది. వీటిలో శ్రీ విద్యానికేతన్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ నుంచే ఎక్కువగా ఆదాయం వస్తోంది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్స్‌లర్‌గా, న్యూయార్క్ అకాడమీ, స్ప్రింగ్‌బోర్డ్ ఎడ్యూకేషనల్, ట్రస్ట్ ఫౌండర్‌గా, ఛైర్మన్‌గా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి యజమానిగా కూడా విష్ణు వ్యవహరిస్తున్నాడు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌కు ఓనర్‌గా మోహన్‌బాబు, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఓనర్‌గా లక్ష్మి చేతుల్లోనే ఉన్నాయి. ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ! ఇలా చూస్తే మనోజ్ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేనట్లే. వ్యాపారాల్లో అసలు మనోజ్‌కు ఎలాంటి భాగస్వామ్యం మోహన్ బాబు ఇవ్వలేదు. ఈ కారణంతోనే మనోజ్ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తండ్రి మోహన్ బాబు తనపై, భార్య మౌనికపై దాడి చేశారని మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మనోజ్ తనపై దాడి చేశారని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు బౌన్సర్లు మనోజ్‌పై దాడి చేయడంతో గొడవ ముదిరింది.