/rtv/media/media_files/2024/12/12/qEToGr2D4z2zXqt8cAdV.jpg)
Mohan Babu: కుటుంబ కలహాలతో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. ఓ మీడియా ఛానెల్ ప్రతినిధిపై చేసిన దాడి కేసులో ఆయనపై BNS 109 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. కాగా నిన్న ఆయనపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని.. దాన్ని ఈరోజు మార్చారు. అయితే దాడి అనంతరం అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. అలాగే మోహన్ బాబు చేత గాయపడ్డ రిపోర్టర్ కూడా ఆసుపత్రి పాలయ్యాడు. రిపోర్టర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు!
హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల్లో మంచు కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ చర్చనీయాంశమైంది. తాజాగా నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు. కాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం.. అందులో పోలీసులు, మీడియా అతి జోక్యం సరికాదని పేర్కొంది. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి 2 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.
Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?
Also Read: Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..!
Also Read: Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం