Lagacharla: లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన కొడంగల్ రైతుకు గుండెపోటు వచ్చింది. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు వీర్యా నాయక్‌కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంగారెడ్డిలో ఆ రైతుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీర్యా నాయక్‌కు ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా మరోసారి రేవంత్ సర్కార్ వివాదంలో చిక్కుకున్నట్లైంది. Also Read: మోహన్ బాబుకు బిగ్ షాక్ బ్రేకింగ్ న్యూస్పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచిన కొడంగల్ రైతుకి గుండెపోటు సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు వీర్యా నాయక్ కు గుండెపోటు ఎవరికి తెలియకుండా ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు సంగారెడ్డిలో కొనసాగుతున్న చికిత్స ఈ విషయం బయటకు రాకుండా అన్ని రకాల… https://t.co/aTk1LIU330 — Telugu Scribe (@TeluguScribe) December 12, 2024 Also Read: మోహన్ బాబు కుటుంబ వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు! వెనక్కి తగ్గిన ప్రభుత్వం... ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం లగచర్ల లో భూసేకరణ కార్యక్రమానికి చెక్ పెట్టింది రేవంత్ సర్కార్. ఫార్మా కంపెనీ ఏర్పాటునకు వెనక్కి తగ్గించింది. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఇటీవల లగచర్లలో భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాగా గతంలో లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. లగచర్లలో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ పై దాడి, ఫార్మా కంపెనీ ఏర్పాటు తమకు వద్దు అని స్థానిక రైతుల ఆందోళన.. భూమి ఇవ్వమంటూ చేపట్టిన ఆందోళనల దృష్ట్యా రేవంత్ సర్కార్ ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది. తాజాగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం లగచర్లలోతో పాటు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2013 చట్ట సెక్షన్ 6(2) కింద భూసేకరణ నోటిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.