Grandhi Srinivas: ఒకేరోజు జగన్‌కు మూడు బిగ్ షాకులు!

AP: జగన్‌కు సొంత పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

New Update
jagan

YCP EX MLA Srinivas: వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు మాజీ మంతులతో సహా ఇతర కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేయగా.. ఇప్పడు అదే బాటలో నడిచేందుకు మరో నేత సిద్ధమయ్యారు. వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు ఏ పార్టీలో చేరుతారనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈరోజు వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు!

ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ రైడ్స్...

ఇటీవల భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం, ఆఫీసులలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు ఐదు రోజుల పాటు ఆయన నివాసంతో పాటు ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో నగదు, పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీటన్నిటిని నుంచి బయట పడేందుకు ప్రభుత్వంలో ఉండే పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులు తనపై రాకుండా ఉండేందుకు ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?

అధిష్టానానికి దూరంగా...

ఎన్నికలు అయ్యాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అన్ని సెట్ అయితే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమని ఆయన అనుచరుల్లో మాట వినిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సిఎం జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. 2019 లో సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు సరైన పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే వైసీపీ అధిష్టానంపై శ్రీనివాస్ అలిగారు. పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న అధిష్టాన నేతలు శ్రీనివాస్ ను బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read: Elon Musk: 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో మస్క్‌..!

Also Read: Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు