Maoist: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్ గఢ్ అబూజ్ మడ్ అడవిప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: కూతురు ఫోన్.. కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి ఒక్కసారిగా విరుచుకుపడిన బలగాలు.. ఈ మేరకు నారాయణపూర్, దంతేవాడ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మవోయిస్టులు ఎదరుపడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు మొదలవగా.. పోలీసులు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ! ఇదిలా ఉంటే.. మంగళవారం బీజాపూర్ అటవీ ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి ముంగా గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టును పోలీసులు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లాగా గుర్తించారు. మావోయిస్టు పార్టీలోని నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లుతో పాటు దాదాపు 30నుంచి 40 మంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లుగా సమాచారం అందడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా? Also Read: TG Crime: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కుటుంబం బలి