నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న డ్రామాకు ఎండ్ పలకమని హితవు పలకారు రాచకొండ సీపీ. ఇంట్లో విషయాలకు బయటకు వచ్చి గొడవపడడమేంటని ప్రశ్నించారు. దాదాపు గంట్నసేపు మంచు విష్ణును సీపీ విచారించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు సీపీ. శాంతి భద్రతలు విఘాత కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..!
నోటీసులకు రెస్పాండ్ అవ్వని విష్ణు..
అలాగే మనోజ్‌తో ఉన్న గొడవ గురించి కూడా విష్ణును అడిగి తెలుసుకున్నారు సీపీ. జల్ పల్లిలోని ఫాంహౌస్ లో తన ప్రైవేట్ సెక్యూరిటీ ని పంపించాలని విష్ణును ఆదేశించారు సీపీ. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పై సైన్ తీసుకున్నారు సీపీ సుధీర్ బాబు. ఈ విచారణకు మోహన్‌బాబు కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ గొడవ కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీని కారణంగా మోహన్ బాబు పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన.. మోహన్ డిసెంబర్ 24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. మరోవైపు సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ నిన్న ఉదయం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమ ఫ్యామిలీలో జరుగుతోన్న పరిణామాలను సీపీకి వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని సీపీకి రూ.లక్ష పూచికత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్.
Also Read: పాలలో ఖర్జూరం కలిపి తాగితే ఇన్ని లాభాలా.. ఈ ఆరోగ్య రహస్యం ట్రై చేయండి
అయితే మోహన్ బాబు, మనజ్ రెస్పాండ్ అయినట్లు విష్ణు పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వలేదు. కోర్టును కూడా ఆశ్రయించలేదు. దీంతో విష్ణుపై పోలీసులు సీరియస్ అయ్యారని సమాచారం. ఆ కారణంగానే రాత్రి 11 గంటలకు విష్ణును సీపీ ఎదుట హాజరుపరిచారని తెలుస్తోంది.
Also Read: సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు